Breaking News

నన్ను ఎగతాళి చేశారు.. నేషనల్ అవార్డ్‌తో సమాధానం చెప్పా

Published on Sun, 04/26/2026 - 23:41

తమిళ స్టార్ హీరో ధనుష్‌ నటించిన తాజా చిత్రం 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుష్‌కు ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమాలో ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేట్‌ను జ్ఞాపికగా అందించారు. దాంతో ధనుష్‌ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ మలుపు తిరిగిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.

వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పొల్లాదవన్' నా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాకు ముందు నన్ను చూసి చాలా మంది చాలా బక్కగా ఉన్నావని ఎగతాళి చేసేవారు. కానీ 'పొల్లాదవన్'లో నేను మొదటిసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించినప్పుడు ప్రేక్షకులు చప్పట్లతో, ఈలలతో నన్ను స్వాగతించారు. నా జీవితంలో అది మర్చిపోలేని క్షణం. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. భగవద్గీతలో చెప్పినట్లుగా 'యద్భావం తద్భవతి'. మనం ఏదైనా బలంగా నమ్మితే, దాన్ని సాధించగలం.

నా కెరీర్ ప్రారంభ రోజులైన "2002-03 సమయంలో నాకు జాతీయ అవార్డు వస్తుందని ఎవరైనా అంటే అందరూ నవ్వుకునేవారు. కానీ నాకు నా మీద నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు ఆ అవార్డు నా చేతిలో ఉంటుందని గట్టిగా నమ్మాను. చివరకు అదే జరిగిందని ధనుష్ అన్నారు. తన పట్టుదల, కృషికి ప్రతిఫలంగా 2010లో ఆడుకాలం, 2019లో అసురన్‌ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు, నిర్మాతగా కూడా కాక ముట్టై, విసారణై వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 

ఇక 'కర' సినిమా విషయానికి వస్తే ధనుశ్, మమిత బైజు జంటగా నటించారు. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. 

Videos

కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!

పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు

మాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా వాలా 2.!

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

"కాల్పులు అయిపోయాయి ఇక తినండి.." ట్రంప్ షాకింగ్ రియాక్షన్

వరుణాస్త్రతో భారత్ సత్తా.. ఇక సముద్రంలో శత్రుదుర్భేద్యం

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్

No పెట్రోల్.. No డీజిల్.. APలో వాహన దారుల కష్టాలు

లేస్తే మనిషిని కాను

ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు

Photos

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)

+5

‘వాలా 2’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)

+5

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)