Breaking News

మా క్రియేటివిటీని చంపుతున్నారు: డైరెక్టర్ శ్రీకాంత్ ఆవేదన

Published on Mon, 06/22/2026 - 19:29

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన కొత్త సినిమా  "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో  హీరోయిన్ స్మేహ మణిమేగలై ఎంట్రీ ఇస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ మూవీతోనే పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ..' తెలుగు ఆడియెన్స్ అభిరుచి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. దీవాన సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మా సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు వచ్చే ఆడియెన్స్ రెస్పాన్స్ మూవీలో చిన్న చిన్న డైలాగ్స్‌కు కూడా వస్తోంది.  తెలుగు సినిమా మరే భాష చిత్రానికీ తక్కువ కాదు, మిగతా వాటికంటే గొప్పగా ఉంటుందని నేను దీవాన చిత్రాన్ని రూపొందించాను. ఇందులో హీరో హీరోయిన్స్ పెయిన్‌ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. మన భాష, మన నేటివిటీ తెలియని వారు కొందరు మా సినిమాలోని ఎస్సెన్స్ పోగొట్టేలా సెన్సార్ కట్స్ ఇస్తున్నారు. ఇంకొందరు బాంబే నుంచి మన తెలుగు సినిమా గ్రేట్ నెస్ తగ్గించేందుకు రివ్యూస్ ఇస్తున్నారు. ఎవరేం చేసినా ఇది నా సినిమా అని గర్వంగా చెప్పగలను. తెలుగులో గత పదేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు' అని అన్నారు.

హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. 'మేము గొప్ప చిత్రం చేశామని గర్వంగా చెబుతున్నా. మేము ఒక రియల్ లైఫ్ మా సినిమాలో చూపించాం. సినిమా చూసి చాలా మంది మెసేజేస్ పంపుతున్నారు. మీరు థియేటర్ కు రండి, మా సినిమా మీకు లైఫ్ టైమ్ మెమొరీ ఇస్తుంది. సెన్సార్ వాళ్లను గౌరవిస్తా కానీ ఈ సినిమాకు మాత్రం వాళ్లు ఇంకా మంచి డెసిషన్ తీసుకోవాల్సింది. అయితే సెన్సార్ వారు చెప్పిన కట్స్ చేసి, మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ చేయించి సర్టిఫికేషన్ తీసుకున్నాం. ఈ ప్రాసెస్ లో ప్రీమియర్స్ వేయలేకపోయాం. సింగిల్ స్క్రీన్స్‌లో వంద రూపాయలే టికెట్  నటుడిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది' ‍అని అన్నారు. ఈ చిత్రంలో వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ కీలక పాత్రలు పోషించారు. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)