Breaking News

దీపికా పదుకొణె చెల్లి పెళ్లి.. ఈమె కూడా సినీ ఫ్యామిలీలోకే!

Published on Sat, 11/29/2025 - 18:14

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. గతేడాది 'కల్కి 2989' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత కొన్నిరోజుల నుంచి ఏదో రకంగా వార్తల్లో ఉంటూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈమె కుటుంబం గురించి ఓ రూమర్ వినిపిస్తుంది. దీపిక చెల్లి కూడా సినీ నేపథ్యమున్న కుటుంబంలోకే కోడలిగా వెళ్లనుందని అంటున్నారు. ఈ మేరకు అబ్బాయి ఎవరు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ)

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణెకి ఇద్దరు కుమార్తెలు అందులో దీపిక పెద్దమ్మాయి. చిన్నమ్మాయి అనీషా. నటిగా దీపిక గుర్తింపు తెచ్చుకోగా.. అనీషా మాత్రం ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా పేరు సంపాదించింది. ప్రస్తుతం అక్కకు చెందిన 'లివ్ లవ్ లాఫ్' అనే స్వచ్ఛంద సంస్థకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తోంది. అనీషా గత కొన్నాళ్ల నుంచి రోహన్ ఆచార్య అనే బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉందని, త్వరలో వీళ్ల పెళ్లి జరగనుందనే న్యూస్ ఇప్పుడు వినిపిస్తోంది.

రోహన్ విషయానికొస్తే ఇతడి ముత్తాత బిమల్ రాయ్.. గతంలో బాలీవుడ్‌లో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రోహన్ సోదరిని.. ధర్మేంద్ర మనవడు (సన్నీ డియోల్ కొడుకు) కరణ్ డియోల్‌ పెళ్లి చేసుకున్నాడు. అలా రోహన్ కుటుంబానికి సన్నీ డియోల్ కుటుంబానికి బంధుత్వం ఏర్పడింది. ఇప్పుడు దీపిక సోదరి అనీషా.. రోహన్‌ని పెళ్లి చేసుకుంటే.. ఈమె కూడా ధర్మేంద్ర కుటుంబంలో ఒకరు అవుతుంది. అక్కలానే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబంలోకే కోడలిగా వెళ్లినట్లు అవుతుంది. ప్రస్తుతానికి దీని గురించి ఇంకా అధికారికంగా చెప్పనప్పటికీ రాబోయే కొన్ని నెలలో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'పెద్ది' ఫైట్.. స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)