Breaking News

ఓటీటీలోకి రకుల్ రొమాంటిక్ కామెడీ సినిమా

Published on Sun, 01/04/2026 - 15:42

తెలుగులో కొన్నేళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అడపాదడపా మూవీస్ చేసింది. కాకపోతే హిట్స్ దక్కలేదు. ఆరేళ్ల క్రితం వచ్చిన ఓ హిట్ మూవీ సీక్వెల్‌తో గతేడాది చివరలో వచ్చింది. అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమా ఇ‍ప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?

అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా రొమాంటిక్ కామెడీ సినిమా 'దే దే ప్యార్ దే'. 2019లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో అద్భుతమైన హిట్‌గా నిలిచింది. మళ్లీ గతేడాది నవంబరు 21న దీని సీక్వెల్‌ని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇ‍ప్పుడీ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ శుక్రవారం (జనవరి 09) నుంచే హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో' తెలుగు రివ్యూ)

'దే దే ప్యార్ దే 2' విషయానికొస్తే.. తొలి పార్ట్‌లో తనకంటే వయసులో చిన్నదైన ఆయేషాని(రకుల్ ప్రీత్ సింగ్) ప్రేమపెళ్లి చేసుకోవాలనుకున్న ఆశిష్(అజయ్ దేవగణ్).. తన మాజీ భార్య(టబు) అనుమతితో పాటు ఆమె కుటుంబ అంగీకారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తాడు. రెండో పార్ట్‌లో రకుల్‪‌ తల్లిదండ్రులైన రాజీ ఖురానా(మాధవన్), అంజు ఖురానా(గౌతమి కపూర్).. ఆశిష్‌తో ఈమె పెళ్లికి అడ్డంకిగా నిలుస్తారు. తనకంటే ఏడాది పెద్దవాడైన ఆశిష్‌తో తన కూతురికి రాజ్ పెళ్లి చేశాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఇకపోతే ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. ఎకో, 120 బహదూర్, డ్రైవ్, బ్యూటీ, హక్ లాంటి తెలుగ్ స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు స్ట్రేంజర్ థింగ్స్ ఫినాలే ఎపిసోడ్, ఎల్‌బీడబ్ల్యూ సిరీస్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

(ఇదీ చదవండి: బాలయ్య అఖండ-2.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ ఫిక్స్)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)