Breaking News

పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?

Published on Mon, 08/18/2025 - 15:02

ఈ ఏడాది తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అలాంటి వాటిలో హీరో నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ ఒకటి. మార్చిలో రిలీజైన ఈ చిత్రం.. హిట్ టాక్‌తో పాటు అద్భుతమైన కలెక్షన్ కూడా అందుకుంది. ఈ చిత్రంతో వైజాగ్ కుర్రాడు రామ్ జగదీశ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మూవీ వచ్చిన ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు.

(ఇదీ చదవండి: సింగర్‌ 'రాహుల్‌ సిప్లిగంజ్‌' నిశ్చితార్థం)

దర్శకుడు రామ్ జగదీశ్ పెళ్లి వైజాగ్‌లో ఆదివారం రాత్రి జరిగింది. కార్తీక అనే అమ్మాయిని వివాహమాడాడు. ఈ వేడుకకు 'కోర్ట్' మూవీ యాక్టర్స్ రోషన్, శ్రీదేవి, శివాజీతో పాటు నిర్మాత ప్రశాంతి కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రామ్ జగదీశ్ పెళ్లి.. పెద్దల కుదిర్చినట్లు తెలుస్తోంది. కార్తీక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితే కాదు. ప్రస్తుతానికైతే ఆమె పేరు మాత్రమే బయటకొచ్చింది. ఇకపోతే రామ్ జగదీశ్ తన తర్వాతి సినిమాని కూడా నాని నిర్మాణంలో తీయబోతున్నాడనే టాక్ కొన్నిరోజుల క్రితం వచ్చింది. ఈసారి మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ మూవీ తీసే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం త్వరలో ప్రకటన వచ్చే అవకాశముంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)