Breaking News

‘కూలీ’ కంటే ‘వార్‌ 2’కే తక్కువ కలెక్షన్స్‌.. తొలి రోజు ఎంతంటే?

Published on Fri, 08/15/2025 - 10:10

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి నటించిన తొలి చిత్రం ‘వార్‌ 2’. భారీ అంచనాల మధ్య నిన్న (ఆగస్ట్‌ 14) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయింది. అయినప్పటికీ తొలి రోజు మాత్రం భారీ కలెక్షన్స్‌నే రాబట్టింది.

(చదవండి: వార్‌ 2 మూవీ రివ్యూ)

మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ వసూళ్లు అయ్యాయి. వాటిలో హిందీ నుంచి అత్యధికంగా రూ. 29 కోట్లు వసూళ్లు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 23.25 కోట్లు రాబట్టింది. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఉన్న భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కారణంగానే ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక తమిళనాడులో అయితే అతి తక్కువగా కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూలీ సినిమా ఎఫెక్ట్‌ కారణంగానే తమిళ్‌లో వార్‌ 2 కలెక్షన్స్‌ భారీగా తగ్గిపోయాయి. గ్రాస్‌ కలెక్షన్స్‌ పరంగా చూస్తే వార్‌ 2 మొత్తంగా రూ. 85-90 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 

(చదవండి: ‘కూలీ’ మూవీ రివ్యూ)

ఇక ఇదే రోజు విడుదలైన కూలీ చిత్రంతో పోలిస్తే..వార్‌ 2 కలెక్షన్సే తక్కువ. కూలీ చిత్రానికి కూడా తొలిరోజే మిశ్రమ స్పందన వచ్చినా.. అత్యధికంగా రూ. 65 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ని రాబట్టింది. రెండు చిత్రాలు కలిసి తొలి రోజు రూ. 117.50 కోట్లు వసూలు చేశాయి. అయితే ఈ చిత్రాలకు ఉన్న బజ్‌తో పోలిస్తే ఇది తక్కువ అనే చెప్పాలి. రెండు చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్‌ అయ్యాయి. 

కానీ ఆ అంచనాలను అందుకోవడంలో రెండూ విఫలం అయ్యాయి అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇక వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. టాక్‌తో సంబంధం లేకుండా ఈ మూడు రోజులు భారీగానే వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. మరి వీకెండ్‌లో ఈ రెండు చిత్రాల్లో ఏది అత్యధికంగా వసూళ్లు సాధిస్తుందో చూడాలి. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)