Breaking News

ఇదెక్కడి విడ్డూరం.. తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?

Published on Tue, 08/12/2025 - 08:55

మరో రెండు రోజుల్లో రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఎవరెంత చెప్పినా సరే ఇవి స్ట్రెయిట్ మూవీస్ కావు. కాకపోతే రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ పుణ్యమా అని 'కూలీ' చిత్రానికి.. తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ అని 'వార్ 2'కి తెలుగులో రాష్ట్రాల్లో మంచి హైప్ ఉంది. అలా అని మన దగ్గర ఏమైనా తక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతారా అంటే లేదు. ఇప్పుడీ విషయమే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. ఇంతకీ ఏంటి సంగతి?

'కూలీ' సినిమాకు చెన్నైలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లో ఈ మూవీ టికెట్ గరిష్ఠ ధర రూ.183 నిర్ణయించారు. కానీ హైదరాబాద్‌లో ఇదే గ్రూప్‌ మల్టీప్లెక్స్‌లో రూ.350 నుంచి రూ.453 మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు కాసేపట్లో జీవో రాబోతుంది. 'కూలీ'కి మాత్రమే కాదు 'వార్ 2'కి కూడా దాదాపు ఇదే ధరలు ఉండనున్నాయి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఒరిజినల్ వెర్షన్ కంటే మన దగ్గర రిలీజయ్యే డబ్బింగ్‌ వెర్షన్‌కే ఎందుకింత ఎక్కువ టికెట్ రేట్లు?

(ఇదీ చదవండి: ప్రభాస్ పెళ్లి కోసం పెద్దమ్మ పూజలు!)

తెలుగు ప్రేక్షకులు.. ఏ భాష సినిమా అయినా సరే బాగుంటే చాలు చూసేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలా అని ఈ విషయాన్ని  గ్రాంటెడ్ తీసుకుంటే.. రాబోయే రోజుల్లో నష్టపోయేది నిర్మాతలే. ఎందుకంటే 'బంగారు బాతు గుడ్డు' కథ మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అలాంటి పరిస్థితులే ఉన్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు.. రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలకు పెడుతున్న టికెట్ రేట్లు చూసి థియేటర్లకు రావడం ఒకప్పటితో పోలిస్తే చాలా తగ్గించేశారు. ఇప్పుడు డబ్బింగ్ చిత్రాల టికెట్ ధరలు కూడా ఒరిజినల్ కంటే ఎక్కువగా పెడితే రాబోయే రోజుల్లో నిర్మాతలకు గడ్డుకాలం గ్యారంటీ!

ప్రేక్షకుడు ఎప్పుడూ కోరుకునేది ఒకటే. సినిమా బాగుండాలి. టికెట్ ధరలు అందుబాటులో ఉండాలి. నిర్మాతలు ఈ విషయం గుర్తుంచుకుని.. అందుకు తగ్గ మూవీస్ తీస్తే చాలు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అలా కాదని వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేయాలని ఆశపడితే ప్రస్తుతానికి పర్లేదు కానీ రాబోయే రోజుల్లో అంతే సంగతులు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)