Breaking News

టాలీవుడ్‌లో మరోసారి విడుదల తేదీల గందరగోళం

Published on Mon, 01/26/2026 - 23:20

టాలీవుడ్‌లో మరోసారి విడుదల తేదీల గజిబిజి మొదలైంది. ఇప్పటికే ఏ నెలలో ఏ సినిమా వస్తుందో లెక్కలు వేసుకుని, హీరోల అభిమానులు కౌంట్‌డౌన్ పోస్టర్లు, సోషల్ మీడియాలో ట్రెండింగులు కూడా మొదలుపెట్టారు. కానీ ముందు అనుకున్నట్టుగా కాకుండా వరుసగా సినిమాలు వాయిదా పడుతుండటంతో పరిశ్రమలో గందరగోళం నెలకొంది.  

ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన స్వయంభు ఏప్రిల్‌కు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మార్చి చివర్లో విడుదల కావాల్సిన రామ్‌ చరణ్‌ 'పెద్ది' మే నెలాఖరుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారం కోసం అదనపు సమయం తీసుకుంటున్నారనే ​ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మార్చి నుంచి వాయిదా పడుతూ మే 1న విడుదల చేస్తారనే ప్రచారం ఉంది.  ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి నెలకే ముందుకు జరిపే అవకాశం ఉందని టాక్. గూఢచారి 2 మే 1న రిలీజ్ అవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ అదే తేదీకి ది ప్యారడైజ్ కూడా వస్తుందనే గాసిప్పులు వినిపిస్తున్నాయి. విశ్వంభర జూన్‌లో విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. కానీ అప్పటికే వాయిదా పడిన సినిమాలు జూన్‌లో స్లాట్ కోసం పోటీ పడే అవకాశం ఉంది.  

ఈ వరుస వాయిదాలతో టాలీవుడ్‌లో రిలీజ్ షెడ్యూల్ పూర్తిగా గందరగోళంగా మారింది. ఒక సినిమా వాయిదా పడితే దాని ప్రభావం మరో సినిమాపై పడుతోంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అందరూ అయోమయంలో ఉన్నారు.  మరో 10 రోజుల్లో ఈ సినిమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతో అభిమానులు అధికారిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)