Breaking News

'హుక్ స్టెప్' అలా పుట్టింది: కొరియోగ్రాఫర్ ఆట సందీప్

Published on Sun, 01/25/2026 - 14:56

ఈసారి సంక్రాంతి రిలీజైన సినిమాల్లో చిరంజీవి 'మన శంకర వరప్రసాద్' సక్సెస్ అందుకుంది. కంటెంట్ పరంగా కొత్తగా ఏం లేనప్పటికీ.. కుటుంబ ప్రేక్షకులకు దీన్ని చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపించారు. దీంతో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చాయని మూవీ టీమ్ ప్రకటించారు. ఇందులో ప్రధానంగా చిరు వేసిన 'హుక్ స్టెప్' సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఆ స్టెప్ ఎలా పుట్టిందో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం!)

'రేపు పాట షూటింగ్. ఇంకా హుక్ స్టెప్ కంపోజ్ చేస్తున్నాను. స్టెప్ రావట్లేదు. ఒకపక్కన ఫోన్ కాల్స్. నిజంగా చెబుతున్న ఆ టైంలో చాలా గందరగోళానికి గురయ్యా. భయం ఏంటంటే చిరంజీవితో సాంగ్ చేస్తున్నా. మరోవైపు వాళ్లు వీళ్లు ఊరికే ఫోన్ చేస్తున్నారు. నా భయం ఏంటంటే చిరంజీవి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందా? లేదంటే ఓ కాస్ట్యూమర్ చేస్తున్నాడా? డ్యాన్సర్స్ కోసం చేస్తున్నారా? లేదంటే ప్రాపర్టీస్ కోసం చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు. ఊరికే ఫోన్స్ వస్తున్నాయి. ఇంకా ఆ టైంలో నా ఫోన్‌ని తీసి నేలకేసి కొడదామనుకున్నా. అప్పటిదాకా రాని స్టెప్.. ఫోన్ పట్టుకోగానే వచ్చింది. అప్పుడు వచ్చిన స్టెప్ ఏదైతే ఉందో.. అదే హుక్ స్టెప్. నేను కంపోజ్ చేయడం ఒకత్తెయితే.. కూరకు ఉ‍ప్పు, మసాలా, కారం జోడించినట్లు చిరంజీవి గ్రేస్ కలిపారు' అని సందీప్ మాస్టర్ చెప్పాడు.

దాదాపు 15-20 ఏళ్ల క్రితం డ్యాన్స్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. తోటి డ్యాన్సర్ జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి హైదరాబాద్‌లోనే డ్యాన్స్ స్కూల్స్ కూడా రన్ చేస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత తనకు చిరంజీవితో పనిచేసే అవకాశమొచ్చిందని ఆట సందీప్ రీసెంట్ టైంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. చూడటానికి సింపుల్‌గా అనిపించే ఈ స్టెప్.. అటు ఫ్యామిలీ ఆడియెన్స్, ఇటు కుర్రాళ్లకు బాగానే నచ్చేసిందని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: సిరై రివ్యూ: ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఉండేది ఇలానే)

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)