Breaking News

విషాదం.. 'వీర్ హనుమాన్' బాల నటుడు మృతి

Published on Mon, 09/29/2025 - 13:10

ప్రమాదం ఏ వైపు నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో అస్సలు ఊహించలేం. ఇప్పుడు కూడా అలా అనుకోని సంఘటన కారణంగా ఓ బాల నటుడు, అతడి సోదరుడు కన్నుమూశారు. ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతుండగా జరిగిన అగ్ని ప్రమాదం కాస్త ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. దీంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

(ఇదీ చదవండి: 'స్పిరిట్'లో మలయాళీ భామ.. మరో బాలీవుడ్ బ్యూటీ ఔట్!)

హిందీలో 'శ్రీమద్ రామాయణ్', 'వీర్ హనుమాన్' సీరియల్స్‌లో నటించిన వీర్ శర్మ(10),  ఇతడి సోదరుడు శౌర్య శర్మ(15) ఆదివారం రాత్రి ఇంట్లో ఓ గదిలో నిద్రపోతున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగి, అన్నదమ్ములిద్దరూ పడుకుని ఉన్న రూంతో పాటు హాల్ అంతా పొగ వ్యాపించింది. అయితే గాఢనిద్రలో ఉండేసరికి వీర్, శౌర్య కదల్లేక పొగ పీల్చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే పిల్లలిద్దరూ మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ప్రమాదం జరిగే సమయంలో వీర్ తల్లి మరో గదిలో ఉండగా.. తండ్రి బయటకు వెళ్లారు. దీంతో వీళ్లకు ఏమి కాలేదు. చిన్నారులు మాత్రం తుదిశ్వాస విడిచారు. అయితే కొడుకులు చనిపోయారే బాధలో ఉన్నప్పటికీ.. పిల్లలిద్దరూ కళ్లని దానం చేసేందుకు తల్లదండ్రులు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ విషయం హిందీ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఇప్పటికే సీరియల్స్ చేసిన వీర్.. త్వరలో ఓ హిందీ సినిమాతో బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నాడు. ఇంతలోనే ఇలా జరగడం ఆ పిల్లల తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగిల్చింది.

(ఇదీ చదవండి: 'బాయ్‌కాట్ కాంతార'.. దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడే ఎందుకిలా?)

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)