Breaking News

అలాంటి కంటెంట్‌కి లేని సమస్య.. టైటిల్స్‌కి ఎందుకు?

Published on Mon, 02/16/2026 - 13:25

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కాస్త పద్ధతిగా ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే సెన్సార్ బోర్డ్ ఏమైనా కళ్లు ముసుకుందా అన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని చిత్రాల్లో బూతులు వినిపిస్తుంటాయి. మరికొన్నింటిలో అయితే మితిమీరిన హింస కనిపిస్తూనే ఉంటుంది. అసలు సెన్సార్ దాటుకుని ఈ మూవీస్ ఎలా బయటకు వచ్చాయా అనేది అంతుచిక్కని ప్రశ్న. వీటిపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు విచిత్రంగా సెన్సార్ బోర్డ్.. తెలుగు సినిమా టైటిల్స్‌పై దండయాత్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

గత నెలన్నర రోజుల్లోనే ఏకంగా నాలుగు తెలుగు సినిమాల టైటిల్స్ విషయంలో సెన్సార్ చాలా ఇబ్బంది పెట్టేసింది. గత నెలలో రిలీజైన 'వనవీర' విషయానికొస్తే.. తొలుత వీళ్లు 'వానర' అనే టైటిల్ అనుకున్నారు. దాదాపు ఆ పేరుతో ప్రమోషన్ అంతా చేసుకున్నారు. తీరా సెన్సార్ జరిగే సమయానికి పేరు మార్చాలని బోర్డ్ చెప్పింది. తప్పని పరిస్థితుల్లో 'వనవీర' అని మార్చుకున్నారు. దీంతో అప్పటివరకు చేసిన ప్రమోషన్స్ అంతా వృథా అయినట్లేగా.

గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'కపుల్ ఫ్రెండ్లీ' అనే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనికి 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయం గురించి ప్రమోషన్లలో మాట్లాడిన డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని.. టైటిల్‌ని 'ఫ్రెండ్లీ కపుల్' అని మారిస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తాం లేదంటే ఏ సర్టిఫికెట్ ఇస్తామని.. సెన్సార్ తమతో చెప్పిందని అన్నారు. చివరకు మూవీ టీమ్.. పేరు మార్చకుండానే సినిమాని రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: మాజీ ఎంపీ కూతురితో యువ హీరో నిశ్చితార్థం.. పెళ్లెప్పుడంటే?)

ఈ వారాంతంలో థియేటర్లలోకి రావాల్సిన సుహాస్ 'హే భగవాన్' సినిమాకు ఇప్పుడు టైటిల్ మార్చేశారు. భగవాన్ బదులుగా బల్వంత్ అని పేరు పెట్టారు. తద్వాతా 'హే బల్వంత్' అయింది. అలానే 'చాయ్ వాలా' అనే మూవీకి కూడా 'నవాబ్స్ కేఫ్' అని టైటిల్ మార్పించారు. పైన చెప్పిన నాలుగు సినిమాల టైటిల్స్‌లోనూ బూతులు గానీ, కించపరిచే పదాలు గానీ లేవు. పోనీ వాటిపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారా అంటే లేదు. అలాంటిది సెన్సారే తనకు తానుగా టైటిల్ మార్చాల్సిందేనని చెప్పడం ఇక్కడ వింతగా విడ్డూరంగా అనిపిస్తుంది.

రీసెంట్‌గా రిలీజైన పలు టీజర్లు, సినిమాలు చూస్తే రక్తం ఏరులైపారుతుంది. లేదంటే టీనేజీ రొమాన్స్‌ని మితిమీరి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటిపై సెన్సార్ ఎందుకు అసలు దృష్టి పెట్టట్లేదు అని నెటిజన్లు.. ఎత్తిచూపుతున్నారు. వీటితో లేని సమస్య.. టైటిల్స్‌కి ఎందుకొచ్చిందా అని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: 'ప్రభాస్‌'కు గాయం.. అసలు విషయం చెప్పిన టీమ్‌)

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు