Breaking News

మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. కవలలు పుట్టిన సినీ దంపతులు వీళ్లే

Published on Sun, 02/01/2026 - 09:31

టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ మరోసారి తండ్రయ్యారు. తాజాగా ఆయన సతీమణి ఉపాసన కొణిదెలకు కవలలు పుట్టారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఓ బాబు, పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో సంబురం నెలకొంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని 
ట్వీట్ చేశారు.

అయితే ఈ శుభ సందర్భంలో సినీ ఇండస్ట్రీలో కవలలు ఎవరెవరికీ పుట్టారనే విషయంపై నెటిజన్స్‌ ఆరా తీస్తున్నారు. దక్షిణదితో పాటు బాలీవుడ్‌లోనూ కొందరు సెలబ్రిటీలకు ట్విన్స్‌ పుట్టారు. ఆ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారనే విషయంపై నెటిజన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ కవల పిల్లలతో డబుల్ ఆనందం పొందిన సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం. 
 

మంచు విష్ణు దంపతులకు ట్విన్స్..

టాలీవుడ్ హీరో మంచు విష్ణు దంపతులకు కవలలు జన్మించారు. ఈ ట్విన్స్‌కు ఆరియానా- వివియానా అనే పేర్లు పెట్టారు. ఇటీవల కన్నప్ప చిత్రంలో వీరిద్దరు నటించారు. ఓ ప్రత్యేక సాంగ్‌లోనూ అరియానా- వివియానా కనిపించారు.

నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులు..

కోలీవుడ్ భామ నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులకు ట్విన్స్ జన్మించారు. వీరికి 2022లో  సరోగసీ ద్వారా ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. వీరిద్దిరకి ఉయిర్, ఉలగం అనే పేర్లు పెట్టుకున్నారు.

బాలీవుడ్ నటి ప్రీతి జింటా..

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాకు ట్విన్స్ జన్మించారు. ఆమె 2021లో సరోగసీ ద్వారానే పిల్లలకు జన్మనిచ్చారు. వీరిది జై, జియా అనే పేర్లు పెట్టారు. ప్రీతి జింటా హీరోయిన్‌గా దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ‍అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. 

సంజయ్ దత్ దంపతులకు ట్విన్స్..

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ -ఆయన భార్య మాన్యతా దత్‌కు ట్విన్స్ జన్మించారు. 2010లో వీరికి కవలలు పుట్టగా షహ్రాన్,  ఇక్రా అనే పేర్లు పెట్టారు. సంజయ్‌ దత్‌ బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.


సెలీనా జైట్లీకి కవలలు..

బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ సైతం కవలలకు జన్మనిచ్చింది.  2011లో వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహం చేసుకున్న స్‌కు 2012లో ట్విన్స్‌ పుట్టారు. ఇద్దరు అబ్బాయిలకు విన్‌స్టన్, విరాజ్ అని పేర్లు పెట్టారు.

శతృఘ్న సిన్హా దంపతులకు ట్విన్స్..

బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా- పూనమ్ సిన్హా దంపతులకు కవలలు జన్మించారు. వీరిద్దరి కుమారులకు లవ్ సిన్హా, కుష్ సిన్హా అనే పేర్లు పెట్టారు. శతృఘ్న సిన్హాకు సోనాక్షి సిన్హా ‍అనే మరో కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ నటిస్తోంది. 

సన్నీ లియోన్ దంపతులకు ట్విన్స్..

బాలీవుడ్ నటి సన్నీ లియోన్- ఆమె భర్త డేనియల్ దంపతులకు ట్విన్స్ పట్టారు. 2018లో వీరికి కవలలు పుట్టగా.. నోవా, ఆషర్ అనే పేర్లు పెట్టుకున్నారు. అంతకు ముందే సన్నీ లియోన్ నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు బిజీగా ఉంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)