Breaking News

బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో పరిస్థితేంటి?

Published on Sun, 09/13/2026 - 20:38

బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్‌ భక్తుడు నీమ్‌ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్‌ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. 
సెప్టెంబరు 18న 
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీస్తే బాక్సాఫీస్‌ దగ్గర ఏకంగా రూ.150 కోట్లు వసూలు చేసింది.  ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి యావత్‌ భారతీయ సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిదీ ఈ చిత్రం. చిన్న సినిమాగా మొదలై సంచలన విజయాన్ని అందుకున్న ఈ మూవీని తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తీసుకురావడం మరింత ఆసక్తిని పెంచుతోంది. సెప్టెంబరు 18న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్‌ థియేటర్లలోకి రానుంది. మరి అక్కడ సంచలనం సృష్టించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


కంటెంట్‌ బలంగా..
సాధారణంగా ప్రేక్షకులకు కంటెంట్‌ బలంగా ఉంటే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆదరించడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా వైవిధ్యమైన కథాంశం, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఉంటే సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ రావడం ఖాయం. ‘హనుమాన్ అంశ్’ విషయంలోనూ ఇదే ప్లస్‌ పాయింట్‌గా మారుతుందా లేదో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: షూటింగ్‌ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్
ఎంతవరకు ప్రభావం చూపుతుందని..
అయితే తెలుగు మార్కెట్‌ పూర్తిగా భిన్నం. ఇప్పటికే భారీ బడ్జెట్‌ సినిమాలు, స్టార్‌ హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సమయంలో.. ఇలాంటి చిన్న బడ్జెట్‌ సినిమా ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. మరోవైపు త్రివిక్రమ్‌ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటంతో సినిమాకు అదనపు క్రేజ్‌ వస్తోంది.
కేవలం వసూళ్లను చూసి సినిమాపై అంచనాలు పెట్టుకోవడం ఒక ఎత్తయితే.. తెలుగు నేటివిటీకి సినిమా ఎంతవరకు కనెక్ట్‌ అవుతుందనేది అసలు పరీక్ష. హిందీలో ప్రేక్షకులను మెప్పించిన అంశాలు తెలుగులోనూ వర్కౌట్‌ అయితే ‘హనుమాన్ అంశ్’ మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:  ఏషనాగుల పాటకి రెమ్యునరేషన్‌ ఎంత ఇచ్చారంటే..
ఆదర్శ కుటుంబం..
మరోవైపు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్. అక్టోబరు 02న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా టీజర్ విడుదల చేశారు.  టీజర్‌లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.  
 

Videos

ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు

పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు

దుబాయ్ కి జంప్.? బయటపడ్డ NANDUS WORLD సీక్రెట్ స్కెచ్..!

ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం

కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో

యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు

3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Photos

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)