Breaking News

రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా

Published on Fri, 09/05/2025 - 18:12

ఈ వీకెండ్ థియేటర్లలోకి ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్ సినిమాలు వచ్చాయి. వీటిలో లిటిల్ హార్ట్స్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు ఓటీటీల్లోనూ 20కి పైగా మూవీస్ వచ్చాయి. అయితే ఓ మూవీ మాత్రం థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే స్ట్రీమింగ్‌లోకి రావడం విశేషం. రొమాంటిక్ కామెడీ కథతో తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఎందులో అందుబాటులోకి వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ)

రాజు జయమోహన్, ఆద్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ సినిమ 'బన్ బటర్ జామ్'. ప్రేమ, పెళ్లి, స్నేహం అనే కాన్సెప్ట్‌తో తీశారు. 'ప్రేమలో ఓడిపోతే అక్కడే ఆగిపోవాలా? తిరిగి లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి?' అనే పాయింట్ బాగా చెప్పారు. అలానే స్నేహం, నిజమైన ప్రేమ మధ్య తేడా చూపించిన విధానం కూడా బాగుంది. జూలై 18న ఈ చిత్రం తమిళంలో రిలీజ్ కాగా దాదాపు నెల తర్వాత అంటే ఆగస్టు 22న తెలుగులో థియేటర్లలో రిలీజ్ చేశారు.

స్టార్స్ లేకపోవడం, ప్రచారం చేయకపోవడం వల్ల ఈ సినిమా అనేది ఒకటి తెలుగులో థియేటర్లలో రిలీజైందని విషయం కూడా ప్రేక్షకులకు రీచ్ కాలేదు. ఇప్పుడు రెండు వారాలు తిరిగేసరికల్లా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. 'బన్ బటర్ జామ్' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

(ఇదీ చదవండి: ‘లిటిల్‌ హార్ట్స్‌’ మూవీ రివ్యూ)

'బన్ బటర్ జామ్' విషయానికొస్తే.. చంద్రు (రాజు జయమోహన్), మధుమిత (ఆద్య ప్రసాద్) ఇంటర్ పూర్తి చేస్తారు. వీళ్ల తల్లిదండ్రులు ఓ పెళ్లిలో కలిసి క్లోజ్ అవుతారు. ప్రస్తుత జనరేషన్‍‌లో ప్రేమ, అరేంజ్డ్ పెళ్లిళ్లు నిలబడట్లేదని మాట్లాడుకున్న వీళ్లు ఓ ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలోనే చంద్రు పక్కింట్లో మధుమిత కుటుంబం దిగుతుంది.  ఇంజినీరింగ్‌ చేరిన చంద్రు.. నందిని(భవ్య త్రిఖ)తో ప్రేమలో పడతాడు. 

నందినిని చంద్రు స్నేహితుడు శ్రీనివాస్ (మైఖేల్ తంగదురై) కూడా ప్రేమిస్తుంటాడు. మరోవైపు మధుమిత.. ఆకాష్ (వీజే పప్పు) అనే కుర్రాడిని ప్రేమిస్తుంది. ఒకరంటే ఒకరు పడని చందు, మధుమితలను కలిపేందుకు వాళ్ల తల్లిదండ్రులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరకు ఎవరి ప్రేమ సుఖాంతమైంది అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: అనుష్క శెట్టి ‘ఘాటి’ మూవీ రివ్యూ)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)