Breaking News

రజనీ,నాగార్జున... ఎన్టీయార్‌ , హృతిక్‌ ‘వార్‌’ తప్పదా?

Published on Thu, 05/08/2025 - 14:39

భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు, భారీబడ్జెట్‌తో రూపొందే సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలు రెండు ఒకే సమయంలో విడుదలయే పరిస్థితి ఏర్పడితే అది మరింత ఉత్కంఠ కలిగించేదే. ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలకూ, దక్షిణాది సినిమాలకు  నడుమ ఇలాంటి పరిస్థితి ఉండేది  కాదు. కానీ ఎప్పుడైతే సౌత్‌ సినిమాలు పాన్‌ ఇండియా మూవీస్‌గా జాతీయస్థాయిలో సత్తా చాటడం మొదలుపెట్టాయో... అప్పటి నుంచి వీటి మధ్య పోటీ కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఓ బాలీవుడ్‌ సినిమాతో మరో దక్షిణాది సినిమా విడుదల తేదీల మధ్య అలాంటి ఉత్కంఠే నెలకొంది.

తమిళ టాప్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌  సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌తో  కూలీ(Coolie) పేరుతో ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా చివరి దశకు వచ్చింది  ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రలు కూడా నటిస్తూండడంతో, ఇది మల్టీ స్టారర్‌ హోదా తెచ్చుకుంది. ఈ భారీ పాన్‌ ఇండియా మూవీ ఆగస్ట్‌ 14న విడుదల చేస్తారని అంచనాలు ఉన్నాయి. నిజానికి కూలీ సినిమా సమ్మర్‌లో రిలీజ్‌ అనుకున్నారు కానీ అది తర్వాత ఆగస్ట్‌కు మారింది. లోకేష్‌ గత సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ కేర్‌ తీసుకుంటున్నాడని అందుకే ఈ ఆలస్యం అంటున్నారు.

మరోవైపు బాలీవుడ్‌ టాప్‌ హీరో హృతిక్‌ రోషన్, టాలీవుడ్‌ అగ్రనటుడు జూ.ఎన్టీఆర్‌ల సెన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం వార్‌ 2(War 2)  కూడా అదే సమయంలో రిలీజ్‌ అవనుంది. దీనితో కూలీ అనుకున్న టైమ్‌ కి వస్తాడా రాడా అనే సందేహాలు రజనీకాంత్‌ అభిమానుల్లో మొదలయ్యాయి. అన్ని హంగులతో  వార్‌ 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మక సంస్థ యష్‌ రాజ్‌ ఫిలింస్‌  రూపొందిస్తున్న  ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్‌ జోడీ కట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయ్‌. మేకర్స్‌ ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 14గా  ఇప్పటికే  ప్రకటించేశారు. అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప అది మారే అవకాశం కనిపించడం లేదు, సో అదేన రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్‌ తప్పదు. రెండు సినిమాల జోనర్‌ వేరువేరు..అయినప్పటికీ... ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్ట్‌ 14న వస్తే, బాక్సాఫీస్‌ వద్ద సీనియర్స్‌ వర్సెస్‌ జూనియర్స్‌ యుద్ధం జరుగుతుందని అనొచ్చు. ఒకవైపు రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి సీనియర్‌ హీరోలు   మరోవైపు ఎన్టీఆర్, హృతిక్‌ల వంటి ఆ తర్వాతి తరం హీరోల మధ్య ఈ పోటీ ఫ్యాన్స్‌ కు సినీ పండితులకు ఖచ్చితంగా సెంట్రాఫ్‌ టాపిక్స్‌ అవుతుంది  అంతేకాదు, పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి కలెక్షన్ల వేట మొదలుపెడితే అది కొత్త రికార్డ్స్‌ క్రియేట్‌ చేసే అవకాశాలూ లేకపోలేదు.
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)