Breaking News

శుభవార్త చెప్పిన గేమ్‌ ఛేంజర్‌ హీరోయిన్‌.. ఓ మై గాడ్‌ అంటూ సామ్‌ రియాక్షన్‌

Published on Fri, 02/28/2025 - 14:31

గేమ్‌ ఛేంజర్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తన భర్త సిద్దార్థ్‌ మల్హోత్రాతో కలిసి బేబీ సాక్స్‌ను చేతిలో పట్టుకున్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. "మా జీవితాల్లో గొప్ప బహుమతి.. త్వరలోనే రాబోతోంది" అని వెల్లడించింది. ఈ పోస్ట్‌ కింద రాశీఖన్నా, అతియా శెట్టి వంటి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత.. ఓ మైగాడ్‌, కంగ్రాచ్యులేషన్స్‌ అని కామెంట్‌ చేసింది.

ప్రేమ.. పెళ్లి
కియారా అద్వానీ- సిద్దార్థ్‌ మల్హోత్రా (Sidharth Malhotra) 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. లస్ట్‌ స్టోరీస్‌ (2018) సినిమా ముగింపు సమయంలో నిర్వహించిన పార్టీలో వీరిద్దరూ కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరూ జంటగా షేర్షా సినిమాలో నటించారు. రోమ్‌ నగరంలో సిద్దార్థ్‌ తనకు ప్రపోజ్‌ చేశాడని కియారా.. కాఫీ విత్‌ కరణ్‌ షోలో వెల్లడించింది. 

సినిమా
కియారా అద్వానీ ఫగ్లీ సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. ఎమ్మెస్‌ ధోని, మెషిన్‌, లస్ట్‌ స్టోరీస్‌, గుడ్‌ న్యూస్‌, కబీర్‌ సింగ్‌, ఇందూ కి జవానీ, భూల్‌ భులయ్యా 2, గోవిందా నామ్‌ మేరా, సత్యప్రేమ్‌ కీ కథ చిత్రాల్లో నటించింది. తెలుగులో భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్‌ ఛేంజర్‌ సినిమాల్లో యాక్ట్‌ చేసింది. ప్రస్తుతం యష్‌ టాక్సిక్‌ మూవీతో పాటు హిందీ వార్‌ 2లో నటిస్తోంది. సిద్దార్థ్‌ మల్హోత్రా.. స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌, ఏక్‌ విలన్‌, కపూర్‌ అండ్‌ సన్స్‌, ఎ జెంటిల్‌మెన్‌, మర్జావాన్‌, షేర్షా, థాంక్‌ గాడ్‌, మిషన్‌ మజ్ను, యోధ సినిమాలు చేశాడు.

 

 

చదవండి: రాహుల్‌ గాంధీపై కేసు? ప్రీతి జింటా ఏమందంటే?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)