రిలేషన్‌షిప్‌లో ఆదిపురుష్ భామ.. మరోసారి భాయ్‌ఫ్రెండ్‌తో కలిసి!

Published on Sat, 02/08/2025 - 15:40

ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. గతేడాది ఎక్కువగా బాలీవుడ్‌లో పలు చిత్రాలతోనే మెప్పించింది. అయితే ఇటీవల ఎక్కువగా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించింది. అంతేకాకుండా ఓ వ్యాపారవేత్తలో ఈ ముద్దుగుమ్మ డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. గతంలో చాలాసార్లు అతనితో కలిసి ఉ‍న్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. గతంలో అతని బర్త్ డే సందర్భంగా కృతిసనన్ ఫోటోలను పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లొ నిలిచింది.

డిన్నర్‌కు వెళ్తూ..

తాజాగా మరోసారి తన భాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న యూకేకు చెందిన వ్యాపారవేత్త కబీర్ దహియాతో కలిసి జంటగా కనిపించింది. ముంబయిలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్తూ జంటగా కనిపించారు.  వీరిద్దరితో పాటు కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా వెంటే ఉన్నారు. అయితే కృతి మాత్రం ఫ్యాన్స్‌కు కనిపించకుండా ముఖానికి మాస్క్ ధరించి కనిపించింది. దీంతో వీరిద్దరిపై మరోసారి నెట్టింట చర్చ మొదలైంది. ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తుండడంతో డేటింగ్‌ ఖాయమనే అంటున్నారు నెటిజన్స్. అంతేకాకుండా గతేడాది వీరిద్దరు కలిసి  గ్రీస్‌కు పర్యటనకు వెళ్లారు. అక్కడే  వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత   క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకున్నారు. తాజాగా మరోసారి జంటగా కనిపించడంతో ఈ జంట రిలేషన్‌లో ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరు తమ రిలేషన్ గురించి ఇప్పటివరకు ఎక్కడా కూడా నోరు విప్పలేదు.


ఇక కృతి సనన్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం దో పట్టిలో కనిపించింది. అంతేకాకుండా గతేడాది క్రూ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ.  కాగా.. కబీర్ దహియా వరల్డ్‌వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ యజమాని కుల్జిందర్ బహియా కుమారుడే కబీర్ దహియా.

 

 

 

 

 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)