Breaking News

పేదల బతుకుల్లో విషాదం.. విజయ్‌ను అరెస్ట్‌ చేయాలి: హీరోయిన్‌

Published on Sun, 09/28/2025 - 13:25

గుండెనిండా దాగిన అభిమానం ఆ గుండె ఆగిపోయేలా చేసింది. అభిమాన నటుడు, నేతను దగ్గరి నుంచి చూడాలని వెళ్లిన వారంతా కళ్లనిండా విజయ్‌ (Actor Vijay) రూపాన్ని నింపుకుని అక్కడే ఆయువు వదిలారు. కొండంత భవిష్యత్తును ఛిద్రం చేస్తూ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, హీరో విజయ్‌ శనివారం రాత్రి తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన 'మీట్‌ ది పీపుల్‌' ప్రచారంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 39 మంది మరణించారు.. 60 మందికి పైగా గాయపడ్డారు.

విజయ్‌ను అరెస్ట్‌ చేయాలి
ఇంతటి విషాదానికి కారణమైన విజయ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ హీరోయిన్‌ ఓవియా (Oviya) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు 'అరెస్ట్‌ విజయ్‌' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ పెట్టింది. దీనిపై విజయ్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోయిన్‌ను బండ బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు.  దీంతో ఆమె తన పోస్ట్‌ను గంటల వ్యవధిలోనే డిలీట్‌ చేసింది. తనను తిడుతూ పెట్టిన కామెంట్ల స్క్రీన్‌షాట్లను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. 'జీవితం జ్ఞానవంతులకు కలలాంటిది, మూర్ఖులకు ఆట, ధనవంతులకు కామెడీ, అదే పేదలకు మాత్రం విషాదం' అని రాసుకొచ్చింది.

బిగ్‌బాస్‌, సినిమా
కేరళ కుట్టి ఓవియా 2007లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. కంగారు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఇది నా లవ్‌ స్టోరీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. కాంచన 3లోనూ యాక్ట్‌ చేసింది. 90 ఎంఎల్‌ అనే వివాదాస్పద సినిమాతో సెన్సేషన్‌ అయింది. ఈ సినిమాలో ఓవియా మహిళలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో చనిపోవడానికి ప్రయత్నించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. గతేడాది ఆమె ప్రైవేట్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో లీకవగా.. చూసి ఆనందించండి అంటూ బోల్డ్‌గా రియాక్టైంది.

చదవండి: నా గుండె వణికిపోయింది.. కరూర్‌ ఘటనపై 'కమల్‌, రజనీ'

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు