Breaking News

'అశ్వత్థామ'గా గౌతమ్‌.. ఇదేందయ్యా ఇది.. ఇంకా మర్చిపోలే?

Published on Wed, 06/18/2025 - 19:29

ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలంటారు. గౌతమ్‌ కృష్ణ (Gautham Krishna) అదే చేశాడు. బిగ్‌బాస్‌ షో వల్ల అవమానాలు పడ్డాడు, ఆదరణ పొందాడు. అదెలాగంటే.. తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొన్న ఇతడు శివాజీకి కరెక్ట్‌ మొగుడిలా తయారయ్యాడు. నేను పట్టుకున్న మంచానికి మూడే కాళ్లు అన్నట్లు శివాజీ డిక్టేటర్‌గా వ్యవహరిస్తుంటే అది తప్పని ఎదిరించి నిలబడ్డాడు గౌతమ్‌ కృష్ణ. శివాజీని ప్రశ్నించేందుకు హౌస్‌మేట్స్‌ వెనకడుగు వేస్తుంటే గౌతమ్‌ మాత్రం అతడి పెద్దరికాన్ని గౌరవిస్తూనే మాటలు, చేతలతోనే ధీటుగా సమాధానం చెప్పేవాడు. 

అశ్వత్థామ అంటూ నవ్వులపాలు!
కానీ షో మధ్యలోనే ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే అతడిని వైల్డ్‌ కార్డ్‌గా హౌస్‌లోకి పంపించినప్పుడు అశ్వత్థామ 2.0 అంటూ వేసిన డైలాగ్‌ అప్పట్లో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. ఆ డైలాగ్‌కు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ తోడవడంతో గౌతమ్‌పై ట్రోలింగ్‌ జరిగింది. చివరకు ఫినాలేకు అడుగు దూరంలో ఉండగా ఎలిమినేట్‌ అయ్యాడు.

అశ్వత్థామకు చావు లేదు
బిగ్‌బాస్‌ 8వ సీజన్‌లో మరోసారి వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడైతే మాటలు పడ్డాడో అక్కడే తన మాటతో, ఆటతో ప్రశంసలు దక్కించుకున్నాడు. రన్నరప్‌గా నిలిచాడు. మరోసారి చెప్తున్నా.. అశ్వత్థామ ఈజ్‌ బ్యాక్‌.. ఈ అశ్వత్థామకు చావు లేదు అంటూ షోలో డైలాగ్స్‌ వేశాడు. ఇప్పుడదే డైలాగ్‌ను తన పేరు ముందు చేర్చేసుకున్నాడు.

పేరు ముందు అదే ట్యాగ్‌
గౌతమ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోలో బాయ్‌ (Solo Boy Movie). బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ రిలీజైంది. ఇందులో గౌతమ్‌ తన పేరు ముందు అశ్వత్థామ అన్న ట్యాగ్‌ యాడ్‌ చేసుకున్నాడు. విమర్శలు, ప్రశంసలు అందించిన అశ్వత్థామ ట్యాగ్‌ను గౌతమ్‌ వాడుకోవడం చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అప్పుడే ఈ  ట్యాగ్‌లు అవసరమా? అని కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారు. అయితే సినిమా కోసం నలుగురు మాట్లాడాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిదే, అందులోనూ అతడు పడి నిలబడ్డాడు అని మరికొందరు పాజిటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు .

 

చదవండి: రజనీకాంత్‌ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్‌ హీరోయిన్‌ సదా కాదు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)