Breaking News

'మాకు చదువు రాదు.. రామును అలా చూస్తుంటే బాధగా ఉంది'

Published on Mon, 09/15/2025 - 14:55

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ నెల ప్రారంభమైన బిగ్‌బాస్ షో ఇప్పటికే ఓ వారం పూర్తి చేసుకుంది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా ఆరుగురు కామనర్స్ ‍హౌస్‌లో అడుగుపెట్టారు. అంతే కాకుండా రాను.. బొంబాయికి రాను అంటూ ఊపేసిన రాము రాథోడ్ సైతం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క ఫోక్ సాంగ్‌తో వైరలైన రాము రాథోడ్‌ బిగ్‌బాస్‌లోకి వెళ్లడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రాము రాథోడ్‌ను బిగ్‌బాస్‌ హౌస్‌లో చూసిన తల్లిదండ్రులు మాత్రం ఫుల్ ఎమోషనలవుతున్నారు. రామును అలా చూడడం మేము తట్టుకోలేకపోతున్నామని రాము తండ్రి ఏడ్చేశారు. మాకు చదువు రాదని.. రాము నవ్వుతున్నప్పుడు సంతోషంగా ఉంటుందని.. ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తే మాకు నచ్చడం లేదన్నారు.  కానీ అవన్నీ ఆటలో భాగమని మాకు తెల్వదని అంటున్నారు రాము పేరేంట్స్. అంతేకాకుండా రాము అందరికీ నచ్చే మనిషి అని అతని తల్లి అన్నారు. అందరినీ బాగా పలకరిస్తాడని చెప్పారు. రామును టీవీల్లో చూస్తుంటే మాకు బాధగా ఉందని అతని తండ్రి ఎమోషనల్‌గా మాట్లాడారు. నువ్వు చివరికీ వరకు హౌస్‌లో ఉండి కప్ గెలవాలని రాము తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. రాము గెలిస్తే మహబూబ్‌నగర్‌లోని గోపాలపురమంతా డ్యాన్స్ చేస్తామని అంటున్నారు అతని తల్లిదండ్రులు. ఏదేమైనా ఒక్క పాటతో ఫేమ్ తెచ్చుకుని బిగ్‌బాస్‌ వరకు వెళ్లిన రాము రాథోడ్ కప్ గెలవాలని అతని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)