Breaking News

'నా జీవితం సర్వనాశనం చేశారు'.. బిగ్‌బాస్ సంజనా గల్రానీ ఆవేదన!

Published on Wed, 10/08/2025 - 15:24

ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్‌ సీజన్-9 నడుస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్‌ కాగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దివ్య కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టింది. తన మైండ్ గేమ్, స్ట్రాటజీతో ఏకంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్‌-9కి తొలి కెప్టెన్‌గా నిలిచింది. ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా రాణిస్తోంది. ఈ సందర్భంగా సంజనా గల్రానీకి సంబంధించిన ఓ వీడియోను బిగ్‌బాస్‌ మేకర్స్ విడుదల చేశారు. ఇందులో తన జర్నీతో పాటు డ్రగ్స్‌ కేసు గురించి కూడా సంజనా మాట్లాడింది. తాను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ఎమోషనలైంది.

ఈ వీడియోలో సంజనా మాట్లాడుతూ.. 'హాయ్ నా పేరు అర్చన.. నేను మీ బుజ్జిగాడు సంజనా అంటూ పరిచయం చేసుకుంది. ఏడో తరగతిలోనే ఇండస్ట్రీలో నేను అడుగుపెట్టాను. జాన్ అబ్రహంతో చేసిన యాడ్ చూసి పూరి జగన్నాధ్ నాకు బుజ్జిగాడులో అవకాశం ఇచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుకుని, కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నా. ఒకరోజు సడన్‌గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్‌ చేశారు. నాకు చావెందుకు రాలేదు? ఆ రోజు డిసైడ్ అయిపోయా. ఆ రోజు గురించి తలుచుకుంటేనే చాలా బాధేస్తోంది. ఒక్కొక్కరు వారికి నచ్చినట్లు రాసుకున్నారుని ఆవేదన వ్యక్తం చేసింది. 

అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. కానీ ఆ క్లీన్ చీట్ ఎవరికీ కనిపించలేదు. చూసేవారికి బిగ్‌బాస్‌ కేవలం ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ షో మాత్రమే కావొచ్చు. కానీ నా లైఫ్‌లో ఈ బిగ్‌బాస్‌ షో నాకు పెద్ద ఛాన్స్. మీ మనసుల్లో నాకు గురించి ఎంత తప్పుగా అనుకున్నారో.. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే వచ్చాను. ఈ షో నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు. కానీ మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్‌బాస్‌కు వచ్చాను" అంటూ ఫుల్ ఎమోషనలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. 1989లో అక్టోబర్ 10న బెంగళూరులో స్థిరపడిన సింధి కుటుంబంలో జన్మించారు సంజన గల్రానీ. టాలీవుడ్ చిత్రపరిశ్రమతోనే తొలి ఛాన్స్ అందుకున్నారు. 2005లో విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన సొగ్గాడులో చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళంలో ఒరు కధల్ సేవిర్‌లో నటించారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రంతో సంజన గల్రానీ లైఫ్​ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, దుశ్శాసన, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.

కాగా.. శాండిల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో సంజనా గల్రానీ పేరు తైరపైకి వచ్చింది. విచారణకు పిలిచిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నెలల పాటు ఆమెను జైల్లోనే ఉంచారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)