Breaking News

డేంజర్‌ జోన్‌లో ఉన్నది వీళ్లే.. లక్స్‌ పాపపై ఎలిమినేషన్‌ వేటు?

Published on Sat, 09/13/2025 - 13:34

గంపెడాశలతో బిగ్‌బాస్‌ హౌస్‌కు వచ్చిన కంటెస్టెంట్లలో ఒకర్ని బయటకు పంపించే తరుణం ఆసన్నమైంది. బిగ్‌బాస్‌ తెలుగు తొమ్మిదో సీజన్‌లో మొదటి ఎలిమినేషన్‌ జరగనుంది. ఈ వారం సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి, సుమన్‌ శెట్టి, శ్రష్టి వర్మ, రాము రాథోడ్‌, డిమాన్‌ పవన్‌, తనూజ, ఇమ్మాన్యుయేల్‌ నామినేషన్స్‌లో ఉన్నారు.

వీళ్లంతా కనిపించారు
వీరిలో అందరికంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు ఇమ్మాన్యుయేల్‌ (Emmanuel). ఓనర్ల (కామన్‌మ్యాన్‌)కు నచ్చిన వంటలు చేస్తూ కడుపునిండా భోజనం పెడుతోంది తనూజ. కెప్టెన్సీ టాస్క్‌లో ఇరగదీశాడు రాము రాథోడ్‌. ఒక్క గుడ్డు దొంగిలించి హౌస్‌ను షేక్‌ చేసింది సంజనా. చివరకు తనను వ్యతిరేకించిన 14 మందిపై అజమాయిషీ చూపించే కెప్టెన్‌గా నిలించింది. గ్లామరస్‌ కంటెంట్‌నిచ్చే రీతూకు ఎలాగో బయట మంచి ఫాలోయింగ్‌ ఉంది. 

ఎపిసోడ్‌లో జాడ లేని కంటెస్టెంట్లు
మిగిలిందల్లా డిమాన్‌ పవన్‌, శ్రష్టి, సుమన్‌ శెట్టి, ఫ్లోరా సైనీ (Flora Saini). సోషల్‌ మీడియా పోల్స్‌ ప్రకారం సుమన్‌ శెట్టికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన పవన్‌ హౌస్‌లో అప్పుడప్పుడు పులిహోర కలుపుతూ కనిపిస్తున్నాడు. కాబట్టి కొన్నాళ్లు అతడిని ఉంచే అవకాశం లేకపోలేదు. ఇక శ్రష్టి, ఫ్లోరా ఎపిసోడ్‌లో పెద్దగా కనిపించడమే లేదు. ఫ్లోరా అయితే సంజనాతో గొడవైనప్పటి నుంచి అదే మనసులో పెట్టుకుని అక్కడే ఆగిపోయింది. బాత్రూమ్‌ క్లీన్‌ చేసే పని అప్పజెప్పడంతో రోజులో ఎక్కువభాగం ఆ వాషింగ్‌ ఏరియా దగ్గరే గడుపుతోంది.

ఇలాగైతే ఎలిమినేషన్‌ ఖాయం
ఆమె నుంచి పాజిటివ్‌ లేదా నెగెటివ్‌.. ఎటువంటి వైబ్స్‌ రాకపోయేసరికి జనాలు తనను పెద్దగా పట్టించుకోనట్లే కనిపిస్తోంది. ఈ లెక్కన ఈ వారం ఫ్లోరా ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లేదంటే అప్పుడే ఎలిమినేషన్‌ ఎందుకని నాగ్‌ (Nagarjuna Akkineni) కనికరించాడంటే మాత్రం ఈ వారం ఫ్లోరాకు గండం గడిచినట్లే! మరి నాగార్జున కనికరిస్తాడా? లేదంటే ఎవర్ని ఎలిమినేట్‌ చేస్తాడనేది వేచి చూడాలి!

చదవండి: ఇమ్మాన్యుయేల్‌పై మాస్క్‌ మ్యాన్‌ దారుణ కామెంట్స్‌.. బాడీ షేమింగ్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)