Breaking News

ఓవర్‌ చేసిన యావర్‌.. అతడే చిట్టచివరి కెప్టెన్‌!

Published on Fri, 11/28/2025 - 07:50

యోధులొస్తున్నారు.. రణరంగంలోకి దిగండి, గెలిచి చూపించండి అని వీర లెవల్లో బిల్డప్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9). మొదటిరోజు నిజంగానే గట్టి పోటీనిస్తూ ఆడారు. కానీ తర్వాత వచ్చినవాళ్లంతా హౌస్‌మేట్స్‌ను గెలిపించడానికే ఓడిపోయినట్లుగా కనిపించింది. మరికొందరేమో ఈ ఆటలన్నీ మా వాళ్ల కాదు, చిల్‌ అవడానికే వచ్చామన్నట్లుగా ఉన్నారు. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగిందో గురువారం (నవంబర్‌ 27వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

అతి చేసిన యావర్‌
బిగ్‌బాస్‌ 7 నుంచి ప్రిన్స్‌ యావర్‌ వచ్చాడు. వచ్చీరావడంతోనే తనూజ నీకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడా? అని సూటిగా అడిగాడు. ఆమె లేదని చెప్పగానే తనతో కలిసి రొమాంటిక్‌ పాటకు స్టెప్పులేశాడు. కాకపోతే సాల్సా డ్యాన్స్‌ చేసి తనను ఇబ్బందిపెట్టినట్లుగానే కనిపించింది. ఆ తర్వాత ఆమె కోసం ప్రేమ పాట పాడాడు. అనంతరం ఇమ్మాన్యుయేల్‌తో కలిసి గేమ్‌ ఆడాడు. ఈ ఆటలో ఇమ్మూ గెలిచాడు.

భరణి వర్సెస్‌ దివ్య
కొన్నివారాలుగా తన ఆట కనిపించడం లేదని నామినేట్‌ చేసేసరికి బాగా హర్టయింది సంజన (Sanjana Galrani). అందరికీ కనిపించాలి, అంతేగా.. అని భరణి ట్యాబ్లెట్లు దొంగిలించేసింది. దొంగతనాలు సంజనాకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి.. తీస్తే ఇచ్చేయండి అని వెళ్లి ఆమెనే అడిగాడు భరణి. ఇమ్మాన్యుయేల్‌ కూడా ఇది సరదా విషయం కాదని చెప్తే ఆమె మాత్రం ఏం పర్లేదంది. మధ్యలో దివ్య కలగజేసుకుని సంజనా ఎలాగో వినది.. ఇమ్మాన్యుయేల్‌ పడుకో, లైట్‌ తీసుకో అంది.

శోభాపై గెలిచిన దివ్య
దీంతో భరణి.. దివ్యపై అరిచాడు. మధ్యలో ఎందుకు మాట్లాడతావ్‌? ఆరిందలా దిగుతావ్‌.. అన్నాడు. అలా ఇద్దరూ గొడవపడ్డారు. అప్పటికీ అదంతా సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయిన సంజనా.. ఉదయానికి టాబ్లెట్స్‌ ఇచ్చేసింది. అనంతరం బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌ శోభా శెట్టి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. శోభాతో పోటీపడి దివ్య గెలిచి కంటెండరయింది. తర్వాత బిగ్‌బాస్‌ 4 ఫైనలిస్ట్‌ సోహైల్‌ అడుగుపెట్టాడు. అతడి ఎంట్రీతో హౌస్‌లో కొత్త ఎనర్జీ వచ్చింది.

అతడే చివరి కెప్టెన్‌
కిలో చికెన్‌, రెండు పాల ప్యాకెట్స్‌, కాఫీ పౌడర్‌ పంపించమని బిగ్‌బాస్‌కే ఆర్డరేశాడు సోహైల్‌. కాసేపు అతడిని ఆటాడుకున్నప్పటికీ చివరకు సోహైల్‌ అడిగినవన్నీ పంపించాడు. తర్వాత రీతూ, సంజనాతో కలిసి సోహైల్‌ గేమ్‌ ఆడాడు. ఈ ఆటలో సంజన, రీతూ గెలిచారు. అలా చివరి కెప్టెన్సీ కోసం కల్యాణ్‌, పవన్‌, దివ్య, ఇమ్మాన్యుయేల్‌, సంజన, రీతూ పోటీపడనున్నారు. సోషల్‌ మీడియా లీక్స్‌ ప్రకారం కెప్టెన్సీ గేమ్‌లో పవన్‌ గెలిచాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమో చూడాలి!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)