Breaking News

నా భార్య 4 రోజులు తినకుండా ఏడ్చింది: సుమన్‌

Published on Fri, 12/19/2025 - 16:40

బిగ్‌బాస్‌ హౌస్‌లో సుమన్‌ను ఇష్టపడనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల దగ్గర నుంచి హౌస్‌మేట్స్‌ వరకు అందరికీ అతడంటే ఇష్టమే! తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ నవ్విస్తాడు. సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే అతడి వైఖరికి అందరూ ఫిదా అవుతారు. కాకపోతే ఆటలో పెద్దగా సత్తా చూపించకపోయేసరికి ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే ఫ్యామిలీ వీక్‌లో సుమన్‌ కోసం అతడి భార్య ఇంట్లోకి వచ్చింది. వచ్చీరావడమే తనూజకు దూరంగా ఉండమని చెప్పింది. 

 మాట మార్చేసిన సుమన్‌
ఇది ఎపిసోడ్‌లోనూ టెలికాస్ట్‌ అయింది. కానీ, ఇప్పుడేమో తన భార్య అలా అనలేదని మాట మార్చేశాడు సుమన్‌. తనూజకు దూరంగా ఉండమని మీ భార్య ఎందుకు చెప్పింది? అని ఓ విలేకరి అడిగాడు. ఆ ప్రశ్నకు సుమన్‌ స్పందిస్తూ.. దూరంగా ఉండమని చెప్పలేదు. తనూజవాళ్లు బాగా ఆడుతున్నారు. మీరింకా బాగా ఆడండి అని చెప్పిందంతే! అంతే తప్ప జాగ్రత్త అని చెప్పలేదు. 

4 రోజులు ఏడుస్తూనే..
మీరు బాగా ఆడుతున్నారు, ఇంకాస్త ఎఫర్ట్స్‌ పెట్టి వాళ్లలా ఆడమని నా భార్య సలహా ఇచ్చింది. అది బయటకు తప్పుగా వెళ్లింది. దానివల్ల ఆమె నాలుగురోజులపాటు తినకుండా ఏడుస్తూ కూర్చుంది. నేను తప్పుగా ఏం చెప్పాను? అని చాలా బాధపడింది అన్నాడు. ఈ కామెంట్స్‌ విన్న జనాలు.. ఎపిసోడ్‌లో అందరం చూశాం.. ఎందుకు కవర్‌ చేయాలని చూస్తున్నావ్‌? ఆమెది ఏ తప్పూ లేకపోతే ఎందుకు ఏడవడం? అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: పిల్లాడికి అబద్ధం చెప్పి బిగ్‌బాస్‌కు.. ఏడ్చేసిన సంజనా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)