Breaking News

ఇది సుమన్‌కు మాత్రమే సాధ్యం.. మళ్లీ జరగదు, జరగబోదు!

Published on Sun, 12/14/2025 - 19:43

కామనర్స్‌ వర్సెస్‌ సెలబ్రిటీస్‌.. ఈ ట్యాగ్‌లైన్‌తోనే సీజన్‌ మొదలైంది. ఈ ట్యాగ్‌తోనే సీజన్‌ ముగింపు కాబోతోంది. కామనర్‌ కల్యాణ్‌, సెలబ్రిటీ తనూజలలో ఒకరు విన్నర్‌, మరొకరు రన్నర్‌ కాబోతున్నారు. సీజన్‌ ముగింపుకు చేరుకోవడంతో హౌస్‌లో డబుల్‌ ఎలిమినేషన్‌ ప్రకటించారు. అందులో భాగంగా సుమన్‌ను ఎలిమినేట్‌ చేశారు.. నేటి ఎపిసోడ్‌లో భరణిని పంపించేయనున్నారు.

ఒక్క కారణం..
సుమన్‌ ఇన్ని వారాలు కొనసాగడమనేది కొంత ఆశ్చర్యకరమనే చెప్పవచ్చు. ఎందుకంటే అతడు బలంగా గేమ్‌ ఆడింది లేదు, కన్నీళ్లు పెట్టుకుని డ్రామాలు చేస్తూ సింపతీకి ప్రయత్నించిందీ లేదు, కంటెంట్‌ కోసం ఓవరాక్టింగ్‌ చేసిందీ లేదు. అయినా 14 వారాలు హౌస్‌లో ఉన్నాడు. అందుకు గల ఏకైక కారణం అమాయకత్వం.

నవ్విస్తాడనుకుంటే..
సినిమాల్లో కమెడియన్‌గా నవ్వించిన సుమన్‌ శెట్టి బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా సైలెంట్‌గా ఉండిపోయాడు. సాధారణంగా అలా ముఖం పక్కకు తప్పుకుని కూర్చుంటే జనాలు వాళ్లను వీలైనంత త్వరగా హౌస్‌ నుంచి పంపించేస్తారు. కానీ, సుమన్‌ను ఎన్నో ఏళ్లుగా అభిమానించినవాళ్లకు అతడిని పంపించేసేందుకు మనసొప్పలేదు. అతడి ముఖంలో, ఆటలో, ప్రవర్తనలో అమాయకత్వాన్ని చూశారు.

ఒక్క స్టెప్పేస్తే చాలు
వీలైనంత వరకు ఎవర్నీ నొప్పించకుండా మాట్లాడేవాడు. మాట్లాడింది తక్కువసార్లే అయినా.. అందులోనూ నీతి, నిజాయితీ వైపు నిలబడ్డ తీరుకు ఫిదా అయ్యారు. ఆయన ఒక్క స్టెప్పేస్తే చాలు.. జనం హాయిగా నవ్వుకునేవారు. తన బలం తనకు తెలియదన్నట్లు టికెట్‌ టు ఫినాలే రేసులో సుమన్‌ బాగా ఆడాడు. కానీ, అది సరిపోదు.. అంతా వదిలేసి చివర్లో కసితో ఆడితే ఏం లాభం.. అందుకే ఎలిమినేట్‌ అయ్యాడు.

అందుకే 14 వారాలు
కేవలం అమాయకత్వంతో 14 వారాలు హౌస్‌లో ఉండటం సుమన్‌ శెట్టి (Suman Shetty) కి మాత్రమే సాధ్యమైంది. ఆయన స్థానంలో ఎవరున్నా బిగ్‌బాస్‌ షోకి మీరు సెట్టవరు అని ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా పంపించేసేవారు. సుమన్‌ను మాత్రం ఆరాధించారు, అభిమానించారు. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు, జరగబోదు కూడా అన్నది సోషల్‌ మీడియాలో నెటిజన్ల వాదన!

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు