Breaking News

ఉగ్రరూపం చూపించిన సుమన్‌.. అమ్మాయిలను ఈడ్చిపడేశాడు!

Published on Fri, 09/19/2025 - 13:45

బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీ గోల అయిపోయింది. డిమాన్‌ పవన్‌ సెకండ్‌ కెప్టెన్‌ అయ్యాడు. ఇప్పుడిక టెనెంట్స్‌కు ఓనరయ్యే ఛాన్స్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అందుకోసం సెలబ్రిటీలకు గేమ్స్‌ పెట్టాడు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్‌ చేశారు. ఓనర్లు విసిరే వస్తువులను పట్టుకుని వాటిని ఎండ్‌బజర్‌ వరకు తమ బాస్కెట్‌లో భద్రంగా దాచుకోవాలి. చివరకు ఎవరి దగ్గర ఎక్కువ వస్తువులుంటే వారే గెలిచినట్లు!

కొట్టేసుకున్న సెలబ్రిటీలు
ప్రియ, మనీష్‌.. బొమ్మలు, బంతులు విసరగా టెనెంట్లు వాటిని క్యాచ్‌ చేసి బాస్కెట్‌లో వేసుకున్నారు. ఆ తర్వాతే అసలు యుద్ధం మొదలైంది. పక్కవాళ్ల బొమ్మల్ని తస్కరించే పని షురూ చేశారు టెనెంట్లు. ఈ క్రమంలో కిందామీదా పడి కొట్టుకున్నట్లే కనిపించారు. ఫ్లోరా, ఇమ్మాన్యుయేల్‌ కలిసి రీతూను కిందపడేశారు. సుమన్‌ శెట్టి.. మోచేతితో ఫ్లోరాను గుద్దిపడేశాడు. ఎవర్నైనా కొడితే గేమ్‌ నుంచి ఎలిమినేట్‌ చేస్తానంది ప్రియ. అయినా సుమన్‌ తగ్గలేదు. 

విశ్వరూపం చూపించిన సుమన్‌
తన దగ్గరకు వస్తే తడాఖా చూపిస్తా అన్నట్లుగా విశ్వరూపం చూపించాడు. అయితే సంజనా అతడి బాస్కెట్‌లోనుంచి దొంగతనం చేయబోతే ఆమె చేయిని విసురుగా నెట్టేశాడు. దానికి ప్రియ.. సుమన్‌ను ఎలిమినేట్‌ చేసింది. ఆ కోపంతో అతడు తన బాస్కెట్‌ను కాలితో తన్నేశాడు. మరి టెనెంట్లలో ఎవరు ఓనర్‌ అయ్యారనేది చూడాలి!

 

చదవండి: బిగ్‌బాస్‌ 9 గ్రాండ్‌ లాంచ్‌కు దారుణమైన TRP రేటింగ్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)