Breaking News

రీతూ పరువు పాయే.. దుమ్ము దులిపేసిన ఇమ్మూ, తనూజ

Published on Wed, 12/03/2025 - 08:15

ఈ సీజన్‌లో ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అయ్యేందుకు అందరికీ సమాన అవకాశాలిస్తున్నానన్నాడు బిగ్‌బాస్‌. రణరంగంలో ఎవరెక్కువ గడులు (బాక్స్‌లు) గెల్చుకుంటే వారే ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అవుతారని చెప్పాడు. ఈ క్రమంలోనే హౌస్‌లో కొన్ని గేమ్స్‌ జరిగాయి. అందులో ఎవరు గెలిచారో మంగళవారం (డిసెంబర్‌ 2వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

రీతూ ఒకటే గొడవ
కంటెస్టెంట్లందరూ చదరంగంలాంటి బాక్స్‌లో ఒక్కో కలర్‌ ఎంచుకున్నారు. చివరకు ఆ బాక్స్‌లో ఎవరి కలర్‌ ఎక్కువ ఆక్రమించుకుంటుందో ఆ కంటెస్టెంట్లే ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అవుతారని చెప్పారు. ఫస్ట్‌ గేమ్‌లో కల్యాణ్‌, పవన్‌, ఇమ్మాన్యుయేల్‌ ఆడతారని తనూజ ప్రకటించింది. అందుకు రీతూ ఒప్పుకోలేదు. ఫస్ట్‌ గేమ్‌ నేనే ఆడతానని వాదించింది. దీంతో పవన్‌ తప్పని పరిస్థితిలో వెనకడుగు వేశాడు.

పరువు పాయే
అలా ఇమ్మూ, కల్యాణ్‌, రీతూ.. మొదటి గేమ్‌ కనుక్కోండి చూద్దాం ఆడారు. మెదడుకు పదును పెట్టే ఈ గేమ్‌లో రీతూ ఒక్క పాయింట్‌ కూడా గెలవలేకపోయింది.. ఆడతా.. ఆడతానంటూ దూకుడు చూపించి మరీ బొక్కబోర్లా పడింది. ఆమె పరిస్థితి చూసిన బిగ్‌బాస్‌ తనకసలు లెక్కలు వచ్చా? రావా? అని టెస్ట్‌ చేసేందుకు రెండో ఎక్కం చెప్పమన్నాడు. దీనికి ఆలోచించుకుంటూనే సెకండ్‌ టేబుల్‌ కరెక్ట్‌గా చెప్పింది. ఈ గేమ్‌లో అంతో ఇంతో కల్యాణ్‌ నాలుగు పాయింట్లు గెలిచాడు. ఇమ్మూ ఆరు పాయింట్లతో ఈ రౌండ్‌ విజేతగా నిలిచాడు. 

సంజనా ఔట్‌
తర్వాత ఇమ్మాన్యుయేల్‌, సంజనా (Sanjana Galrani)తో బాల్స్‌ గేమ్‌ ఆడి గెలిచాడు. ఆటలో ఓడిపోయినందుకు సంజనా బోరుమని ఏడ్చేసింది. ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అయ్యే రేసు నుంచి సంజనా వైదొలిగింది. తర్వాత పూల గేమ్‌లో భరణి, తనూజ, డిమాన్‌ పవన్‌ తలపడ్డారు. ఫిజికల్‌ అవుతున్నావ్‌, ఫిజికల్‌ అవుతున్నావ్‌ అని తనూజ పదేపదే అనేసరికి పవన్‌ కాస్త సైలెంట్‌ అయిపోయాడు. అలా తెలివిగా ఈ ఆటలో తనూజ గెలిచింది. తర్వాతి తన గేమ్‌ కోసం సుమన్‌ శెట్టిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. ఈ గేమ్‌లో ఎవరు గెలిచారో చూడాలి!

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)