Breaking News

మాధురికి క్లాస్‌ పీకిన నాగార్జున.. తీరు మార్చుకోమని హెచ్చరిక!

Published on Sat, 10/18/2025 - 12:44

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Telugu 9)లో ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లున్నారు. వీరిలో ఆరుగురు కొత్తగా వచ్చిన వైల్డ్‌కార్డ్స్‌ ఉన్నారు. వారిలో ఎక్కువ హైలైట్‌ అవుతుంది ఇద్దరే ఇద్దరు. ఒకరు మాధురి, మరొకరు ఆయేషా! అరుపులు, ఏడుపులు తప్ప ఏదీ కనిపించడం లేదంటూ తనూజను నామినేట్‌ చేసిన ఆయేషా.. వచ్చినప్పటినుంచి అరుస్తూనే కనిపించింది. నిన్న ఒక్క గేమ్‌ ఓడిపోయేసరికి బోరుమని ఏడ్చింది. 

వాయించేసిన నాగ్‌
మాధురి (Divvala Madhuri).. హౌస్‌కు రెండో బిగ్‌బాస్‌లా ఫీలవుతోంది. అందరిపై ఆజమాయిషీ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్‌తో ఓ గొడవ కూడా జరిగింది. ఆ గొడవలో తప్పెవరిది? అని కెప్టెన్‌ సుమన్‌ను అడిగాడు నాగ్‌. అందుకు సుమన్‌ తడుముకోకుండా మాధురిదే తప్పన్నాడు. ఆరోజు ఏం జరిగిందో వీడియో క్లిప్పింగ్‌ వేసి మరీ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పు లేదు.. కానీ, మాట్లాడిన తీరు తప్పు అని మాధురికి క్లాస్‌ పీకాడు. నా గొంతే అలా ఉంటుందని కవర్‌ చేసుకునేందుకు ప్రయత్నించుకోగా దాన్ని నాగ్‌ ఖండించాడు.

సూపర్‌ పవర్‌ నిర్వీర్యం
మరిప్పుడు నీ గొంతు అలా లేదు కదా.. మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుందని హెచ్చరించాడు. మాధురికి ఉన్న సూపర్‌ పవర్‌ ఉంచాలా? తీసేయాలా? అని స్టూడియోలో ఉన్న ‍ప్రేక్షకుల్ని అడగ్గా వారు తీసేయడమే మంచిదన్నారు. వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చినరోజు ఆమెకు ఎలిమినేషన్‌ను రద్దు చేసే పవర్‌ ఇచ్చారు. ప్రేక్షకుల తిరస్కారంతో ఆ పవర్‌ ఇప్పుడు నిర్వీర్యమైపోయింది.

 

చదవండి: ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్‌ భయం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)