Breaking News

వెళ్లిపోతానన్న సంజనా.. బలవంతంగా సారీ చెప్పించిన నాగ్‌

Published on Sun, 11/30/2025 - 08:46

కాదేదీ గొడవకు అనర్హం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు హౌస్‌మేట్స్‌. ప్రమోషనల్‌ టాస్కులో కూడా తనూజ గొడవపడటం చూసేవాళ్లకు సైతం చిరాకు పుట్టించింది. ఇక రీతూ క్యారెక్టర్‌ను తప్పుపట్టిన సంజనాకు నాగ్‌ క్లాస్‌ పీకాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శనివారం (నవంబర్‌ 29వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

సంజనాపై సీరియస్‌
పవన్‌, రీతూ.. అంటుకుని కూర్చుంటారు, అది నచ్చలేదని నామినేట్‌ చేశాను అని సంజనా మళ్లీ అదే వాదించింది. మీరు చేసేపనులకు కళ్లు మూసుకోవాల్సి వస్తుందన్నావ్‌.. అంతలా ఏం చేశారు? ఎందుకు పర్సనల్‌ టార్గెట్‌ చేశావ్‌? ఎందుకంత నింద వేశావ్‌? అని నాగార్జున సీరియస్‌ అయ్యాడు. హౌస్‌లో ఎవరికీ అసౌకర్యంగా లేనిది నీకు మాత్రమే ఎందుకు అనిపించింది? అంత ఇబ్బందిగా ఉంటే వెళ్లిపో అని గేట్లు తెరిచాడు.

కన్నీళ్లతో అభ్యర్థించిన సంజనా
దీంతో సంజనా (Sanjana Galrani) నేను వెళ్లను, ఉంటాను సర్‌ అని కన్నీటితో అడిగింది. ఇంతలో నాగ్‌.. గతంలో సంజనా ఎలిమినేట్‌ అవకుండా కాపాడిన నలుగురు.. ఇమ్మాన్యుయేల్‌, భరణి, రీతూ, తనూజను లేచి నిల్చోమన్నాడు. సంజనా హౌస్‌లో ఉండాలా? వద్దా? అనేది నిర్ణయించాలన్నాడు. ఇప్పటికే వాళ్ల త్యాగం, దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నానన్న పేరుంది.

పంపించేయండి
మరోసారి వీరి కనికరంతో హౌస్‌లో ఉండలేను అనుకున్న సంజనా నాగార్జుతో.. వెళ్లిపోతాను, పంపించేయండి అని కోరింది. కానీ అప్పటికే నిర్ణయం ఆ నలుగురి చేతిలోకి వెళ్లిపోయిందన్నాడు నాగ్‌. ఆ నలుగురు.. సంజనా క్షమాపణలు చెప్తే హౌస్‌లో ఉండొచ్చన్నారు. అయినా సారీ చెప్పేందుకు తను ముందుకు రాలేదు. వెళ్లిపోవడానికే సిద్ధపడింది. 

బలవంతంగా సారీ..
దీంతో నాగార్జున ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. కచ్చితంగా సారీ చెప్పాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఆమెకు ఇష్టం లేకపోయినా రీతూకి, ప్రేక్షకులకు సారీ చెప్పింది. నామినేషన్స్‌లో డిమాన్‌ పవన్‌.. కల్యాణ్‌ పీక పట్టుకోలేదని, అతడిని ఆపేందుకు ప్రయత్నించాడని క్లారిటీ ఇచ్చాడు నాగ్‌. అలాగే బూతు పదాలు మాట్లాడొద్దని కల్యాణ్‌ను హెచ్చరించాడు.

చదవండి: బిగ్‌బాస్‌ 9: దివ్య ఎలిమినేట్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)