Breaking News

బిగ్‌బాస్ 9.. మళ్లీ ఈ ట్విస్టులేంటి?

Published on Tue, 11/25/2025 - 11:49

ఈసారి బిగ్‪‌బాస్ ఎప్పుడేం చేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. ఈ సీజన్‌లో ఆల్రెడీ ఎలిమినేట్ అయినోళ్లని ఓసారి తిరిగి తీసుకొచ్చి కొన్ని గేమ్స్ ఆడించాడు. వాళ్లలో గెలిచిన ఒక్కరిని రీఎంట్రీ చేయించాడు. అతడే భరణి. ఇదే కాదు రకరకాల ప్రయోగాలన్నీ ఈ సీజన్‌లోనే జరుగుతున్నట్లు అనిపిస్తున్నాయి. ప్రస్తుతం 12వ వారంలో కెప్టెన్ అయ్యేందుకు మరో కొత్త ప్రయోగం చేశాడు.

(ఇదీ చదవండి: అఫీషియల్.. ఆస్కార్ బరిలో 'మహావతార్ నరసింహ')

సోమవారం నామినేషన్ ప్రక్రియ మంచి రంజుగా సాగింది. కల్యాణ్-పవన్ ఒకరిపై ఒకరు రెచ్చిపోవడం, ఈ క్రమంలోనే కల్యాణ్ పీక పవన్ పట్టుకోవడం.. పవన్-రీతూ బంధం గురించి సంజన నోరు పారేసుకోవడం ఇలా మంచి మసాలా కనిపించింది. అలా కెప్టెన్ రీతూ తప్పితే మిగిలినోళ్లందరూ ఈసారి లిస్టులోకి వచ్చారు. మంగళవారం నుంచి చివరి కెప్టెన్సీ కోసం పోటీ మొదలైపోయింది. ఈసారి హౌస్‌మేట్స్ మధ్య కాకుండా ఓ హౌస్‌మేట్.. గత సీజన్లకు చెందిన ఓ కంటెస్టెంట్ వచ్చి పోటీ పడతాడు.

ఈసారి భరణితో బయట నుంచి వచ్చిన గౌతమ్ కృష్ణ పోటీపడ్డాడు. బిగ్‌బాస్‌లో అశ్వద్ధామ అంటూ హడావుడి చేసి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్.. ఏడో సీజన్‌లో ఓ మాదిరి ప్రదర్శన చేయగా, గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఇప్పుడు మళ్లీ కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ పడేందుకు వచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. భరణి-గౌతమ్ పోటీ పడ్డారు. చివరగా భరణినే విజేతగా నిలిచాడు అన్నట్లు చూపించేశారు. మొత్తం ప్రోమోలోనే చూపించేస్తే ఇక ఎపిసోడ్‌లో ఏం చూపిస్తారా అనేది అర్థం కాలేదు. అయినా హౌస్‌లో ఉన్నవాళ్ల మధ్య పోటీపెడితే మజా ఉంటుంది గానీ బయటనుంచి తీసుకొచ్చి గేమ్స్ పెట్టడం ఎందుకో సరిగా అనిపించట్లేదు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)