Breaking News

లక్స్‌ పాప సేఫ్‌.. నీలా బూతులు మాట్లాడనంటూ రీతూను రెచ్చగొట్టిన శ్రీజ

Published on Thu, 09/25/2025 - 09:46

తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ (Bigg Boss Telugu 9) మొదలై రెండు వారాలైందంతే.. అప్పుడే ఫ్యామిలీ కోసం బోరుమని ఏడుస్తున్నారు కంటెస్టెంట్లు. ప్రతిసారి కనీసం నెల రోజుల తర్వాతే ఫ్యామిలీ మెంబర్స్‌ నుంచి లెటర్లు గట్రా పంపేవాడు. అదేంటో కానీ ఈసారి రెండువారాలకే ఈ కుటుంబ ఎమోషన్స్‌ ఎపిసోడ్‌ మొదలుపెట్టేశారు. బ్లూ సీడ్స్‌ అందుకున్నవారికే ఈ అవకాశం కల్పించాడు. 

సీక్రెట్‌ బాక్స్‌ ఓపెన్‌
అందులో భాగంగా ఇప్పటికే ఇమ్మాన్యుయేల్‌ ఫ్యామిలీ ఫోటో గెల్చుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో తనూజ, ప్రియ ఇంటినుంచి లెటర్స్‌ అందుకున్నారు. సుమన్‌ ఇంటినుంచి ఏదైనా అందుకోవాలంటే భరణి సీక్రెట్‌ బాక్స్‌ ఓపెన్‌ చేయాలని బిగ్‌బాస్‌ మెలిక పెట్టాడు. దీంతో అతడు తన బాక్స్‌ ఓపెన్‌ చేశాడు. అందులో ఒక చైన్‌, లాకెట్‌ ఉంది. లాకెట్‌లో అమ్మ, గురువు అని రాసుంది. వీరిద్దరూ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని చెప్పాడు.

శ్రీజ, రీతూ మధ్యే అసలైన పోటీ
అలా సుమన్‌ తండ్రి ఫోటో అందుకున్నాడు. కానీ సంజనాకు ఏదీ అందలేదు. ఇకపోతే బ్లాక్‌ సీడ్స్‌ ఉన్న ముగ్గురు రీతూ, శ్రీజ, ఫ్లోరాకు గురి తప్పద్దు అనే గేమ్‌ పెట్టాడు. ఈ గేమ్‌కు సంజనాను సంచాలక్‌గా పెట్టారు. ఇక బరిలో దిగిన శ్రీజ, రీతూ పోటాపోటీగా ఆడారు. రీతూ విజయం తథ్యం అన్న సమయంలో శ్రీజ ఆటను మలుపు తిప్పింది. తను గెలవకపోయినా పర్లేదు కానీ రీతూ గెలవకూడదన్న ఉద్దేశంతో ఫ్లోరాకు సాయం చేసింది.

నీలాగా బూతులు మాట్లాడట్లేదుగా
అది చూసిన రీతూ.. గేమ్‌ సరిగా ఆడు, నువ్వు గెలవాలని ఆడు కానీ, ఇదేంటి? అని చిరాకు పడింది. అందుకు శ్రీజ.. నా గేమ్‌ నా ఇష్టం. నువ్వు మొన్న రాముకు సపోర్ట్‌ చేయలేదా? నేను ఫ్లోరాకు సమాన అవకాశం రావాలని చేస్తున్నా.. నీలాగా బూతులు మాట్లాడి వేరొకరినైతే హర్ట్‌ చేయట్లేదుగా అని కౌంటరిచ్చింది. చివరకు ఈ గేమ్‌లో ఫ్లోరా గెలిచి ఈ వారం ఇమ్యూనిటీ దక్కించుకుంది.

ఎప్పుడూ ఇంతే..
అంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కకపోవడంతో రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు అదృష్టం కలిసిరాదు, ఎప్పుడూ ఇంతే.. అని బోరుమని ఏడవడంతో అందరూ ఆమెను ఓదార్చారు. ఇక ఈ వారం ఫ్లోరా గెలవడంతో నామినేషన్స్‌లో ఐదుగురే మిగిలారు. వారే ప్రియ, రాము, రీతూ, పవన్‌ కల్యాణ్‌, హరీశ్‌. వీరిలో ప్రియ డేంజర్‌ జోన్‌లో ఉంది. మరి ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది చూడాలి!

చదవండి: స్టార్‌ హీరో ఇల్లు వేలం.. రోడ్డు మీదకు సతీమణి

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)