Breaking News

ఈసారి డబుల్ ఎలిమినేషన్.. ఫ్లోరాతో పాటు ఆమె కూడా!

Published on Sat, 10/11/2025 - 20:30

అనుకున్నదే జరిగినట్లు కనిపిస్తుంది. ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయిపోయినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌లో ప్రస్తుతం ఐదో వారం నడుస్తోంది. గత నాలుగు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్, ప్రియ, హరీశ్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎవరవుతారోనని అందరూ అనుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఈసారి ఏకంగా 10 మంది నామినేట్ అయ్యారు. వీళ్లలో ఇప్పుడు ఇ‍ద్దరు బయటకెళ్లిపోయారట.

బిగ్‌బాస్ నుంచి ఈ వారం.. తొలి వికెట్‌గా ఫ్లోరా బయటకెళ్లిపోయినట్లు ఖరారైపోయింది. లెక్క ప్రకారం తొలి రెండు వారాల్లోనే ఈమె ఎలిమినేట్ అయిపోతుందని అంతా అనుకున్నారు. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే పెద్దగా యాక్టివ్‌గా ఉండదు, నామినేట్ చేసినా సరే పెద్దగా వాదులాడటం లాంటివి చేయకుండా సరే సరే అని అనడం, గత కొన్నిరోజుల నుంచి అయితే సంజనకు సేవకురాలిగా ఉండటం తప్పితే పెద్దగా చేసినట్లు కనిపించలేదు. దీంతో ఈ వారం ఫ్లోరాని బిగ్‌బాస్ బయటకు పంపేశాడు.

(ఇదీ చదవండి: ప్రధాని మోదీని కలిసిన చరణ్-ఉపాసన.. కారణం ఏంటంటే?)

ప్రతి సీజన్‌లోనూ ఐదో వారం దాదాపుగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉంటుంది. ఈసారి కూడా ఆరుగురు రాబోతున్నారు. దీంతో డబుల్ ఎలిమినేషన్ ఉండటం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఫ్లోరాతో పాటు నామినేట్ అయిన వాళ్లలో ఎవరి వికెట్ పడుతుందా అనుకున్నారు. డేంజర్ జోన్‌లో అయితే శ్రీజ, దివ్య, రీతూ, పవన్, సుమన్ శెట్టి ఉన్నట్లు తెలిసింది. వీళ్లలో నుంచి ఇప్పుడు శ్రీజని కూడా బయటకు పంపేశారట. అయితే ఈ ఎలిమినేషన్ కాస్త విచిత్రంగా సాగింది.

మామూలుగా అయితే ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే పంపిస్తుంటారు. కానీ శ్రీజని మాత్రం.. హౌస్‌లోకి రాబోతున్న వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ముకుమ్మడిగా బయటకు పంపేశారట. డేంజర్ జోన్‌లో ఉన్నవాళ్లలో ఎవరిని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలని అడగ్గా.. ఎక్కువమంది శ్రీజ పేరు చెప్పారట. దీంతో ఈమెని డబుల్ ఎలిమినేషన్‌లో బయటకు పంపేశారని తెలుస్తోంది. ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేషన్స్‌తో పాటు వైల్డ్ కార్డ్స్ ఎవరనేది కూడా క్లారిటీ రానుంది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)