Breaking News

తనూజను ఎత్తుకుని తిరిగితే నీకేంటి సమస్య? ఏడ్చేసిన దివ్య

Published on Mon, 12/01/2025 - 09:34

తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ నుంచి దివ్య ఎలిమినేట్‌ అయింది. ఎలిమినేట్‌ అయిన వెంటనే సరాసరి బజ్‌ ఇంటర్వ్యూకి హాజరైంది. అక్కడ శివాజీ ఏయే ప్రశ్నలడిగాడు? తను ఎలా సమాధానాలిచ్చిందో ప్రోమో వదిలారు. అది ఓసారి చూసేద్దాం..

వాళ్ల చుట్టూయే ప్రశ్నలు
దివ్య గురించి మాట్లాడాలంటే కచ్చితంగా రెండు పేర్లు ముందుకు వస్తాయి. అవే భరణి, తనూజ. బజ్‌ ఇంటర్వ్యూ మొత్తం కూడా ఈ రెండు పేర్ల చుట్టూనే తిరిగింది. దివ్య నిఖితలాంటి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌కు భరణి అవసరం ఏమొచ్చింది? ఆయన తనూజతో ఎలా ఉంటే నీకేంటి సమస్య అని శివాజీ నిలదీశాడు. నాకేం ప్రాబ్లం లేదని దివ్య చెప్తుంటే.. నీ పొసెసివ్‌నెస్‌ మాకు స్పష్టంగా కనిపిస్తోదన్నాడు శివాజీ. 

తనూజను ఎత్తుకుంటే నీకేంటి సమస్య?
వాళ్లను విడగొట్టి నేనేం సాధిస్తాను? పోనీ.. నేను రాగానే విడిపోయారంటే వాళ్ల రిలేషన్‌ అంత వీకా? అని దివ్య తిరిగి ప్రశ్నించింది. భరణి.. తనూజను ఎత్తుకుని తింపుతాడు, ఆయింట్‌మెంట్‌ రాస్తాడు.. నీకేంటి ప్రాబ్లమ్‌? అని అడిగాడు. ఒకసారి బయటకు వెళ్లి వచ్చాక ఆయన నిన్ను అంతగా ఎంకరేజ్‌ చేయలేదు.. గమనించావా? అంటూ ఆమెను దూరంగా ఉంచిన విషయాన్ని గుర్తు చేశాడు. అందుకు దివ్య కూడా అవునని తలూపింది.

వెక్కెక్కి ఏడ్చిన దివ్య
నిన్ను భరణి (Bharani Shankar)కి దూరంగా ఉండమని చెప్పమని మీ తల్లి మాధురిని వేడుకుందన్న విషయం చెప్పాడు. అది విని దివ్య మౌనంగా కూర్చుండిపోయింది. ఇక భరణిని తల్చుకుని దివ్య ఎమోషనలైంది. భరణి నా అన్నయ్య.. మళ్లీ హౌస్‌లోకి వచ్చారు. ఆయనతో ఉండాలి, ఆయన్ని బాగా చూసుకోవాలి అనే అనుకున్నాను. బయటకు వచ్చాక ఆయన నాతో ఎలా ఉంటారో నాకు తెలీదు కానీ నేను మాత్రం ఎప్పుడూ ఆయన మంచి కోరుకునే శ్రేయోభిలాషిగానే ఉంటానని ఏడ్చేసింది.

 

చదవండి: దివ్యను నామినేట్‌ చేసి ఇప్పుడేమో ఏడ్చేసిన భరణి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)