Breaking News

బిగ్‌బాస్‌లో మాధురి కొత్త రూల్స్‌.. నచ్చకపోతే వెళ్లిపోమని వార్నింగ్‌!

Published on Thu, 10/16/2025 - 09:40

(Bigg Boss Telugu 9) వైల్డ్‌కార్డులు తమ ప్రతాపం చూపించాలనుకుంటున్నారో, ఏమో కానీ గొడవలు పడుతూనే ఉన్నారు. మాధురి తగ్గేదేలే అన్న లెవల్‌లో కొట్లాటకు సిద్ధం అవుతుంటే ఆయేషా కావాలని కొందరిని టార్గెట్‌ చేసి మరీ తిడుతోంది. మరి నిన్నటి (అక్టోబర్‌ 15వ) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేద్దాం...

ప్రాంక్‌ పేరుతో..
సంజనాతో కలిసి ప్రాంక్‌ గొడవ ప్లాన్‌ చేసింది మాధురి (Divvala Madhuri). ప్రాంక్‌ పేరుతో మనసులో ఉన్న కోపం, అక్కసునంతా సంజనాపై కక్కేసింది. ఆమె తిట్ల దండకానికి జడుసుకున్న సంజనా.. వెంటనే కట్‌ చెప్పేసి ఇదంతా ఊరికనే చేశామని చెప్పి ఊపిరి పీల్చుకుంది. మాధురి.. దివ్యను టార్గెట్‌ చేసిందో ఏంటోకానీ, మరోసారి ఆమెతో గొడవపడింది. దివ్య సాధారణంగా మాట్లాడుతుంటే కూడా నువ్వెంత? అని చీప్‌గా తీసిపడేసే ప్రయత్నం చేసింది. రూల్స్‌ పాటించనని, తనకు నచ్చినట్లుగానే ఉంటానని, అది నచ్చకపోతే హౌస్‌ నుంచి వెళ్లిపోమని దివ్యకు ఆర్డర్‌ వేసింది. లైవ్‌లో హౌస్‌మేట్స్‌ అందరికీ ఇంకా చాలానే ఆంక్షలు పెట్టింది.

నా రూల్స్‌ నచ్చకపోతే వెళ్లిపో
రాత్రి ఇకఇకలు పకపకలు ఉండొద్దని, లైట్స్‌ ఆఫ్‌ అయ్యాక అంతా సైలెంట్‌గా ఉండాలంది. మీ అల్లరి వల్ల తన నిద్ర చెడిపోతే క్షమించను అని వార్నింగ్‌ ఇచ్చింది. పొద్దున పాట వచ్చేవరకు మాట్లాడొద్దని కండీషన్‌ పెట్టింది. అంతగా మాట్లాడాలనుకుంటే గార్డెన్‌ ఏరియాకి వెళ్లి సైలెంట్‌గా మాట్లాడుకోమంది. ఈ రూల్స్‌కు రీతూ ఒప్పుకోలేదు. మీరు చెప్పిన మాట వినేందుకు ఇక్కడికి రాలేదు. బిగ్‌బాస్‌ రూల్స్‌ మాత్రమే పాటిస్తా అని కరాఖండిగా చెప్పింది. నా రూల్స్‌ నచ్చకపోతే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి వెళ్లిపోమనగా.. నేనెందుకు వెళ్తా.. కావాలంటే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది రీతూ. మాధురి రూల్స్‌ పెడుతుంటే కెప్టెన్‌ ఏం చేస్తున్నాడో మరి!

ఓవరాక్షన్‌ ఆపవే..
కిచెన్‌లో గిన్నెలు తోమే దగ్గర ఆయేషా, రీతూకి పంచాయితీ అయింది. రాత్రి గిన్నె కడగనని ఆయేషా.. అది అర్ధరాత్రి సింక్‌లో వేశారని రీతూ గొడవపడ్డారు. నీ పని నువ్వు చేయకపోతేనే కదా అడుగుతున్నాను.. ఫస్ట్‌ కరెక్ట్‌గా ఉండు.. అని కోప్పడింది ఆయేషా. నువ్వు కూడా ఉండని రీతూ అనగా.. నువ్వు ఊరుకోవే.. ఏం పని చేయవు, అడిగితే న్యన్యన్య అంటావ్‌ అని ఆయేషా వెక్కిరించింది. మధ్యలో మాధురి కూడా దూరిపోయి రీతూపై రెచ్చిపోయింది. ఏయ్‌.. నీకో స్టాండ్‌ లేదా? అబద్ధాలు ఆడుతున్నావ్‌ అంటూ మండిపడింది. రీతూ కూడా తగ్గకుండా ఆమెకు కౌంటర్లిచ్చింది. ఇక గిన్నెలు తోముతున్న ఆయేషా.. ఆపవే ఓవరాక్షన్‌.. మాటలు ఆపేయ్‌ ఫస్ట్‌.. అంటూ రీతూను వాయించేసింది.

పెద్ద లిస్ట్‌ చదివిన పచ్చళ్ల రమ్య
మరోవైపు పచ్చళ్లపాప రమ్య మోక్ష తన సూపర్‌ పవర్‌ ఉపయోగించేసింది. ఈరోజు కోసం నిన్న ఫుడ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. ఆర్డర్‌ అంటే ఏదో బిర్యానీ, ఐస్‌క్రీమ్‌ అంతేగా అనుకునేరు.. కాదుకాదు! టిఫిన్‌లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరి, మైసూర్‌ బజ్జీ.. లంచ్‌లోకి ఎగ్‌ బిర్యానీ, చికెన్‌ జాయింట్స్‌, వెజ్‌ టిక్కా పిజ్జా..  సాయంత్రం బనానా చిప్స్‌, నాలుగు ఎగ్‌ ట్రేలు, మిక్చర్‌, ఫ్యామిలీ ప్యాక్‌ ఐస్‌క్రీమ్‌, చాక్లెట్స్‌.. డిన్నర్‌కు చికెన్‌, వెజ్‌ పికిల్స్‌, నాన్‌వెజ్‌ పికిల్స్‌.. ఇలా పేద్ద లిస్ట్‌ చదువుకుంటూ పోయింది. ఈ ఫుడ్‌ను హౌస్‌మేట్స్‌ అందరూ ఆస్వాదించేందుకు వీల్లేదు. కేవలం రమ్య.. ఆమె సెలక్ట్‌ చేసిన సుమన్‌ మాత్రమే కలిసి షేర్‌ చేసుకోవాలి.

చదవండి: దీపికా పదుకొణెతో మీరు కూడా మాట్లాడొచ్చు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)