Breaking News

కల్యాణ్‌ తల్లికి చీర పెట్టిన తనూజ.. అంత స్పెషల్‌ ఏంటో?

Published on Fri, 11/21/2025 - 09:00

బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) ఇంట్లోకి పవన్‌ కల్యాణ్‌, రీతూ, భరణి ఫ్యామిలీ మెంబర్స్‌ వచ్చారు. వారు ఏం మాట్లాడారు? హౌస్‌లో ఏమేం జరిగాయో గురువారం (నవంబర్‌ 20వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

కల్యాణ్‌ తల్లికి తనూజ గిఫ్ట్‌
ఫ్యామిలీ వీక్‌ వద్దని బెట్టు చేసిన కల్యాణ్‌ (Pawan Kalyan Padala).. తల్లిని చూడగానే చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలని తల్లి కల్యాణ్‌ దగ్గర మాట తీసుకుంది. చివర్లో తనూజ.. కల్యాణ్‌ తల్లికి చీర పెట్టి సాగనంపింది. అది చూసిన కల్యాణ్‌ ఎందుకు స్పెషల్‌గా మా అమ్మకే చీర పెట్టావ్‌? అని అడిగాడు. అందుకామె.. నువ్వు నాపై ఎంతో కేర్‌ చూపించావ్‌, అందుకు బదులుగా తనకు చీర పెట్టాలనిపించింది, పెట్టాను అని సమాధానమిచ్చింది. 

రీతూ తల్లి ఎంట్రీ
అలాగే తనపై లేనిపోని ఆశలు పెంచుకుంటున్న కల్యాణ్‌కు బిగ్‌బాస్‌ అయిపోయాక నీ జర్నీ నీది.. నా జర్నీ నాది అని క్లారిటీ ఇచ్చింది. అందుకు కల్యాణ్‌ నువ్వు సంతోషంగా ఉండటమే నాక్కావాలి అంటూ ప్రేమపిపాసిలా డైలాగులు కొట్టాడు. తర్వాత రీతూ తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూడగానే రీతూ బోరుమని ఏడ్చేసింది. కానీ, ఆమె తల్లి మాత్రం నువ్వు నాకు నచ్చట్లేదంటూ చపాతీ కర్ర అందుకుని కొట్టబోయింది. కానీ కూతురి ఏడుపు చూసి కొట్టేందుకు చేతులు రాలేదు.

మాడిపోయిన పవన్‌ ముఖం
తనూజ, ఇమ్మూని పిలిచి మరీ మాట్లాడింది. కానీ డిమాన్‌ పవన్‌ను అసలు పట్టించుకోలేదు. దీంతో అతడి ముఖం వాడిపోయింది. గేమ్స్‌లో మాత్రమే ఫోకస్‌ చేయ్‌.. ఇంకేం వద్దు అని హెచ్చరించింది. మరి అది రీతూ తలకు ఎక్కించుకుందో? లేదో! ఇదంతా చూసిన పవన్‌.. రేపటినుంచి రీతూకి దూరంగా ఉండాలని మనసులో అనుకున్నాడు. తర్వాత భరణి కూతురు ఎంట్రీ ఇచ్చింది. తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది. 

దివ్యకి దూరంగా ఉండు
తనూజ-నాన్న బంధం తన ఫేవరెట్‌ అంది. నువ్వు కెప్టెన్‌ అయితే చూడాలనుందని తండ్రిని కోరింది. దివ్యను తన తండ్రిపై కమాండింగ్‌ కాస్త తగ్గించమని కోరింది. ఆమె అటు వెళ్లగానే కమాండ్‌ చేసేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నీపై అరుస్తుంటే సైలెంట్‌గా ఉండకండి. అలా అరవడం నచ్చడం లేదని చెప్పండి అని తండ్రికి సలహాలు ఇచ్చింది. ఇక హౌస్‌లోకి అందరి ఫ్యామిలీ మెంబర్స్‌ వచ్చారు, ఒక్క ఇమ్మూకి తప్ప! రేపు అతడి తల్లి ఇంట్లో అడుగుపెట్టనుంది. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూద్దాం..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)