Breaking News

బిగ్‌బాస్‌ దరిద్రపుగొట్టు ఐడియా.. నీళ్లు ఉమ్మే టాస్క్‌ ఏంటయ్యా!

Published on Fri, 10/24/2025 - 10:21

బిగ్‌బాస్‌కు కొత్త ఐడియాలు రావడం లేదేమో! కొన్నిసార్లు పిచ్చి టాస్కులిస్తున్నాడు. నీళ్లు ఉమ్మే టాస్క్‌ అయితే మరీ దారుణం. అమర్‌దీప్‌- అర్జున్‌ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఉపశమనంగా కనిపిస్తుంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో గురువారం (అక్టోబర్‌ 23వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

మట్టి కరిపించిన డిమాన్‌ పవన్‌
సంజనా సైలెన్సర్‌- మాస్‌ మాధురి గ్యాంగ్స్‌కు జెండాలే ఎజెండా టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో సంజనా తరపు నుంచి బరిలో దిగిన డిమాన్‌-గౌరవ్‌.. మాధురి గ్యాంగ్‌ నుంచి వచ్చిన ఇమ్మాన్యుయేల్‌, కల్యాణ్‌ను మట్టి కరిపించారు. డిమాన్‌ పవన్‌ మరోసారి టాస్కుల వీరుడు అని నిరూపించుకున్నాడు. సంజనా రాను రాను శృతి, గతి అన్నీ తప్పుతోంది. నోటికి ఏదొస్తే అది అనేస్తోంది. చెత్తబుట్ట తీసుకొచ్చి.. ఇది ఖాళీ చేయలేదు.. పని చేయకుండా పిక్నిక్‌కు వచ్చారా? అని అరిచేసింది. 

చెండాలం టాస్క్‌
కెప్టెన్స్‌ గౌరవ్‌, సుమన్‌తోనూ.. నేనేమైనా మీ పనిమనిషినా? నేను మీ సర్వెంట్‌ కాదంటూ చిందులు తొక్కింది. తర్వాత బిగ్‌బాస్‌ ఓ దరిద్రపు టాస్క్‌ ఇచ్చాడు. నోట్లో నీళ్లు పోసుకుని ఎక్కువ దూరంలో ఉన్న బకెట్‌లో ఉమ్మితే ఎక్కువ పాయింట్లు అట! ఇదే ఒక చెత్త టాస్క్‌ అంటే.. మా బకెట్‌లో చుక్క నీరు పడింది.. అక్కడ పడలేదంటూ గొడవ పెట్టుకున్నారు. ఈ గేమ్‌లో సంజన టీమ్‌ గెలిచింది. 

మీరు తోపు.. మేము తుప్పాస్‌
దీంతో బిగ్‌బాస్‌ చెప్పినట్లుగా మాధురి టీమ్‌ మెంబర్స్‌ అంతా మోకాళ్లపై కూర్చుని మీరు తోపు.. మేము తుప్పాస్‌ అని సంజనాకు చెప్పారు. ఇక ఈ వాంటెడ్‌పేట గేమ్‌లో రాము, రమ్య దగ్గర ఒక్క రూపాయి లేకపోవడంతో కంటెండర్‌ రేసు నుంచి తప్పుకున్నారు. తర్వాత బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్లు అమర్‌దీప్‌-అర్జున్‌ పోలీస్‌ గెటప్స్‌లో హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. కాసేపు కామెడీ చేసి నవ్వించారు. ఇది నేటి ఎపిసోడ్‌లో కూడా కొనసాగనుంది.

చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)