ఆగకుండా 5000 KMs.. ఐదు రోజుల్లో పరిగెత్తిన గద్దలు
Breaking News
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్: తనూజతో తగ్గించండి.. సుమన్‌కి భార్య సలహా
Published on Wed, 11/19/2025 - 10:45
బిగ్‌బాస్ షోలో మిగతా అన్ని వారాలు ఎలా ఉన్నాసరే ఫ్యామిలీ వీక్ అంటే మాత్రం అటు హౌస్‍మేట్స్, ఇటు ప్రేక్షకులకు బోలెడంత ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఈ వారమంతా అందరూ ఒక్కటైపోతారు. ఈసారి కూడా ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది. అంతకంటే ముందు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ జరగ్గా.. దివ్య, పవన్, భరణి, ఇమ్ము, సంజనా, కల్యాణ్ నామినేట్ అయ్యారు. రీతూ కూడా అయ్యింది కానీ కెప్టెన్ తనూజ వల్ల ఆమె సేవ్ అయిపోయింది.
ఈసారి ఫ్యామిలీ వీక్ నేరుగా మొదలుపెట్టేయకుండా బిగ్‌బాస్.. చిక్కుముడి అనే టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా ఓ ఫ్రేమ్‌కి గజిబిజిగా కట్టున్న తాడుని విప్పి, ఒంటికి చుట్టుకుని.. చివరలో దాన్ని విప్పి మాగ్నెటిక్ బోర్డులో ఉన్న టైమ్ కార్డ్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. బిగ్ బాంబ్ ఉన్న కారణంగా సంజనకు ఈసారి ఛాన్స్ లేదు. దీంతో ఆమెని ఈ టాస్క్ కోసం సంచాలక్‌గా పెట్టారు. కెప్టెన్ కావడంతో తనూజకు నేరుగా టైమ్ తీసుకునే ఛాన్స్ బిగ్‌బాస్ ఇవ్వడంతో 60 నిమిషాల టైమ్ కార్డ్ తీసుకుంది. తర్వాత పోటీ జరిగింది. ఇమ్మాన్యుయేల్ 45, పవన్ 30, కల్యాణ్ 20, దివ్య 20, సుమన్ 15, రీతూ 15, భరణి 15 నిమిషాల కార్డ్స్ తీసుకున్నారు.
(ఇదీ చదవండి: నయనతార బర్త్ డే.. గిఫ్ట్‌గా ఖరీదైన రోల్స్ రాయిస్)
తొలుత సుమన్ శెట్టికి అవకాశమొచ్చింది. 16వ పెళ్లిరోజు అని చెప్పి భార్య లాస్య నుంచి లెటర్ వచ్చింది. అలానే ఓ స్పెషల్ కోట్ కూడా వచ్చింది. దీంతో సుమన్ రెడీ కాగానే.. భార్య లాస్య లోపలికి వచ్చింది. చాలారోజుల తర్వాత కలిసేసరికి సుమన్, భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేశాడు. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత చివరలో లాస్య.. 'టాప్-5లో ఉండాలి. గెలిస్తే ఇంకా హ్యాపీ. తనూజతో తగ్గించండి. హైప్‌లో ఉండేవాళ్లని దగ్గర చేసుకుంటుంది. ఏడవద్దు' అని చెప్పి వెళ్లిపోయింది.
సుమన్ భార్య వెళ్లిపోయిన కాసేపటి తర్వాత తనూజ ఫ్యామిలీ నుంచి వచ్చారు. చెల్లితో పాటు అక్క కూతురు శ్రేష్ఠ హౌస్‌లోకి వచ్చింది. చెల్లి పూజ లోపలికి రాగానే.. పెళ్లి కూతురు పూజ అని చెబుతూ హౌస్‌మేట్స్ అందరికీ తనూజ తన చెల్లిని పరిచయం చేసింది. తనే చెల్లి, కానీ నాకు అమ్మ లాంటిది అని కూడా అందరితో చెప్పింది. ఇద్దరూ సెపరేట్‌గా వెళ్లి మాట్లాడుకున్నారు. 'ఎక్కువగా బాధపడకు, ఏడవుకు. అను, అమ్మని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. నా పెళ్లికి కొన్నిరోజులే ఉంది. నువ్వు గేమ్ ఆడేదంతా ఫెర్ఫెక్ట్‌గా ఉంది. నువ్వే చేస్తావో నాకు తెలీదు నువ్వే గెలవాలి. నా పెళ్లికి బిగ్‌బాస్ టైటిల్ కావాలి' అని పూజ, తనూజకి మంచి బూస్టప్ ఇచ్చింది. చివరికు పూజని పెళ్లి కూతురిని చేసి, ఆమెని హౌస్ నుంచి పంపించారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: 'రాధేశ్యామ్' దర్శకుడి ఇంట్లో విషాదం)
Tags : 1