Breaking News

బిగ్‌బాస్‌లోకి మరో కంటెస్టెంట్‌ ఫిక్స్‌.. శ్రీజ, పవన్‌ను ఏకిపారేశారు!

Published on Thu, 09/25/2025 - 13:29

బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ (Bigg Boss Telugu 9)లో ప్రస్తుతం పదమూడు మంది కంటెస్టెంట్లున్నారు. విన్నింగ్‌ మెటీరియల్‌ అనిపించేలా ఏ ఒక్కరూ లేరు. అంతో ఇంతో ఇమ్మాన్యుయేల్‌ పర్వాలేదనిపిస్తున్నాడు. ఆటకు ఆట.. వినోదానికి వినోదం, ఎమోషన్స్‌కు ఎమోషన్‌.. అన్నింటినీ బ్యాలెన్స్‌ చేస్తున్నాడు. కానీ కొన్నిసార్లు అతి మంచితనం చూపిస్తున్నాడు.

అగ్నిపరీక్ష నుంచి మరొకరు
ఇకపోతే అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్‌ ప్రేక్షకులకు విపరీతంగా విసుగు తెప్పిస్తున్న సంగతి తెలిసిందే కదా! అయితే అదే అగ్నిపరీక్ష నుంచి మరో ఇద్దర్ని హౌస్‌కు పంపించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో షాకిబ్‌, దివ్య నిఖిత, నాగ ప్రశాంత్‌, అనూష రత్నం ఉన్నారు. వీరిలో ఒకర్ని మీరే ఎంపిక చేయాలని  బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు బాధ్యత అప్పగించాడు. 

ఉన్నదున్నట్లు మాట్లాడిన అనూష
దానికంటే ముందు అనూష.. శ్రీజ (Dammu Srija)కు వరుస కౌంటర్లిచ్చింది. నీ ఇగో సంతృప్తి చెందకపోతే పుండుపై పిన్నుతో గుచ్చినట్లు పొడుస్తూనే ఉంటావ్‌. 24 గంటలు నెగెటివ్‌ ఎనర్జీతో ఉండే నీతోనే స్వాప్‌ చేసుకోవాలనుకుంటున్నా అంది. ఆ మాటకు శ్రీజ షాకై అలా చూస్తూ కూర్చుండిపోయింది. షాకీబ్‌.. పవన్‌ కల్యాణ్‌ స్థానాన్ని తీసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. 

టైంపాస్‌ చేయడానికా?
అక్కడితో ఆగలేదు. పవన్‌ చేస్తున్న పనుల్ని ఎండగట్టాడు. షోకి ఎందుకొచ్చినం బ్రో? టైంపాస్‌ చేయడానికి కాదు కదా.. బయటకు వెళ్లగొడితే ఎట్లుంటదనేది నేను ఆల్‌రెడీ చూసేశిన. ఆ ఫీలింగ్‌ మీకు తెలియదు అన్నాడు. మొత్తానికి వచ్చీరావడంతోనే శ్రీజ, పవన్‌ కల్యాణ్‌కు ఆడియన్స్‌ ఎలా ఫీలవుతున్నారనేది చెప్పి వారికి హింట్లు ఇచ్చేశారు. ఇక హౌస్‌మేట్స్‌ అందరూ దివ్య నిఖితను సెలక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

 

చదవండి: ముచ్చుముఖం రీతూ.. నా భర్తకు ఏదో అలవాటు చేసింది

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)