Breaking News

బిగ్‌బాస్ 9.. ఈసారి ఆమెతో పాటు మరొకరు ఎలిమినేషన్!?

Published on Sat, 11/29/2025 - 20:28

బిగ్‌బాస్ 9 సీజన్ తుది అంకాని వచ్చేసినట్లు కనిపిస్తుంది. ఈ ఆదివారంతో 12 వారాలు పూర్తయిపోతాయి. అంటే మరో మూడు వారాలు మాత్రమే మిగిలుంటాయి. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది ఉన్నారు. అయితే ఫినాలేలో టాప్-5 ఉంటారా? టాప్-6 ఉంచుతారా? అనేది కొన్నిరోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఇకపోతే గతవారం మిస్ అయిన లేడీ కంటెస్టెంట్ ఈసారి ఎలిమినేట్ అయిందని, మరొకరిని కూడా హౌస్ నుంచి పంపించబోతున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి?

ఈ వారం కెప్టెన్ రీతూ తప్పితే మిగిలిన వాళ్లంతా నామినేషన్‌లో ఉన్నారు. లెక్క ప్రకారం గతవారం దివ్య ఎలిమినేట్ అయిందని న్యూస్ తొలుత వచ్చింది. చివరి ప్లేసులో ఉండటంతో అంతా పక్కా అనుకున్నారు. కానీ ఇమ్మాన్యుయేల్ తన దగ్గరున్న పవర్ ఉపయోగించి ఎలిమినేషన్ లేకుండా చేశాడు. దీంతో దివ్య బతికిపోయినట్లుంది. ఈసారి మాత్రమే ఆమె తప్పించుకోలేకపోయిందని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ)

ఈ వారం నామినేషన్లకు సంబంధించి శుక్రవారం వరకు ఓటింగ్ జరగ్గా.. కల్యాణ్ తొలి స్థానంలో నిలిచాడని, తర్వాత స్థానంలో తనూజ ఉండగా.. అనంతరం వరసగా ఇమ్మాన్యుయేల్, పవన్, భరణి, సుమన్ శెట్టి, సంజన, దివ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దివ్య ఎలిమినేట్ అయినట్లు సమాచారం బయటకొచ్చింది. గత వారం మిస్ అయినప్పటికీ ఈసారి ఈమె బయటకొచ్చేయడం గ్యారంటీ అని టాక్.

ఇంకా మూడు వారాలే మిగిలున్న దృష్ట్యా.. ఈసారి మరొకరిని కూడా ఎలిమినేట్ చేయొచ్చని అంటున్నారు. అలా చూసుకుంటే సంజనని బయటకు పంపే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. అయితే సుమన్ శెట్టి కూడా ప్రస్తుతం డేంజర్ జోన్‌లోనే ఉన్నాడని, ఒకవేళ అతడు ఎలిమినేట్ అయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. గత కొన్ని వారాల నుంచి చూసుకుంటే సుమన్ శెట్టి గ్రాఫ్ చాలావరకు తగ్గిపోయింది. గేమ్స్ పరంగా కావొచ్చు, మిగతా విషయాల్లో కావొచ్చు.. తొలివారాలతో పోలిస్తే సుమన్ బాగా వెనకబడిపోయినట్లు టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఈ వారం దివ్యతో పాటు ఎలిమినేట్ అయ్యే హౌస్‌మేట్ ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

(ఇదీ చదవండి: దీపికా పదుకొణె చెల్లి పెళ్లి.. ఈమె కూడా సినీ ఫ్యామిలీలోకే!)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)