Breaking News

ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్‌.. అంచనాలను పెంచేసిన బిగ్‌బాస్‌

Published on Sun, 09/13/2026 - 22:10

బిగ్‌బాస్‌ సీజన్‌-10లో ఆదివారం ఎపిసోడ్‌ సందడిగా సాగింది. వినాయక చవితి సందర్భంగా హోస్ట్‌ నాగార్జున కంటెస్టెంట్లకు పండగ శుభాకాంక్షలు తెలిపి షోను ప్రారంభించారు. ఎప్పటిలాగే తనదైన శైలిలో కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూ.. అవసరమైన చోట క్లాస్‌ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో బ్లాక్‌ కీతో హౌస్‌లో కొత్త ట్విస్ట్‌ తీసుకొచ్చారు. ఇక రెండో వీకెండ్‌ ఎలా ఉండబోతుందో కూడా హింట్‌ ఇచ్చారు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఒకసారి ఓ లుక్కేద్దాం..

ఇంగ్లీష్‌పై నాగార్జున అసంతృప్తి
హౌస్‌లో కొందరు కంటెస్టెంట్లు ఎక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడటంపై నాగార్జున స్పందించారు. హౌస్‌లో జరిగే విషయాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలంటే వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్‌ రాని ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలుగు సరిగా మాట్లాడటం రాకపోయినా ప్రయత్నిస్తున్న దేబ్జానీని ఈ సందర్భంగా నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు.

దేబ్‌జానీకి ఫుల్‌ క్రేజ్‌.. రోహిత్‌కు వార్నింగ్‌
కంటెస్టెంట్ల మనసులో ఎవరు ఉన్నారు? ఎవరు దూరంగా అనిపిస్తున్నారు? తెలుసుకునేందుకు నాగార్జున ఓ ఆసక్తికరమైన టాస్క్‌ను కంటెస్టెంట్లకు  ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కంటెస్టెంట్లు తమ మనసులోని మాటలను బయటపెట్టారు. ఎక్కువమంది దేబ్జానీ పేరును ఇష్టపడుతున్నట్లు చెప్పడంతో నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. ‘నువ్వు చాలా పాపులర్‌ అయిపోతున్నావు’ అంటూ ఆమెతో సరదాగా అన్నారు. మరోవైపు రోహిత్‌ పేరును ద్వేషిస్తున్నట్లు తెలపడంతో రోహిత్‌ను హౌస్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని నాగార్జున సూచించారు.
ఎక్కువ మంది చదివింది: అభిమానికి అండగా రామ్‌.. ఆమె ‍కోసం మరో అడుగు
బ్లాక్‌ కీతో అసలు ట్విస్ట్‌
ఆదివారం ఎపిసోడ్‌లో బ్లాక్‌ కీతో బిగ్‌బాస్‌ మరో ఆసక్తికరమైన ట్విస్ట్‌ ఇచ్చారు. నాగార్జున తీసుకొచ్చిన బ్లాక్‌ కీని ఎవరికి ఇస్తే.. ఆ వ్యక్తి దగ్గర ఉన్న కీ పవర్‌ పనిచేయకుండా పోతుందని తెలిపారు. దీంతో ఆ బ్లాక్‌ కీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కంటెస్టెంట్ల అభిప్రాయాలు తీసుకున్నారు.  అందరిలో ఎక్కువమంది సృష్టి పేరు చెప్పారు. చివరికి బ్లాక్‌ కీని సృష్టికి ఇవ్వాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన

ఇదే సమయంలో ఇప్పటివరకు మ్యాజిక్‌ కీ లేని నలుగురు కంటెస్టెంట్లకు మరో అవకాశం కల్పించారు.  ఈ మేరకు బ్లాక్‌ బాక్స్‌ను సొంతం చేసుకునేందుకు నిర్వహించిన టాస్క్‌లో సుదీర్‌ విజయం సాధించాడు. దీంతో సృష్టి తన దగ్గర ఉన్న బ్లాక్‌ కీని సుదీర్‌కు అందించింది. ఇక సుదీర్‌ చేతికి చేరిన ఈ బ్లాక్‌ కీతో హౌస్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

ఎలిమినేషన్‌లో ట్విస్ట్‌..
ఈ ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్‌గా అమన్‌, ముకేశ్‌, సృష్టి, నరేశ్‌లన ఎంపిక చేశారు. ఇప్పటివరకు హౌస్‌మేట్స్‌కానీ సుదీర్‌, వర్షిణి, కృష్ణుడుని యాక్టివిటీ రూంలోకి పంపించారు.  ‘ మీ ముగ్గురులో హౌస్‌మేట్స్‌ ఎవరు.. ఎలిమినేట్‌ ఎవరు అవుతారో అక్కడ ఉన్న డోర్స్‌ తెరిస్తే తెలుస్తుంది’ అని నాగార్జున వాళ్లకి తెలిపాడు. ఇక్కడ ఓ మ్యాజిక్‌ జరిగింది అంతా సుదీర్‌ ఎలిమినేట్‌ అవుతాడు అనుకున్నారు. కానీ ఈ ముగ్గురూ హౌస్‌మేట్స్‌గానే ఎంపికయ్యారు.

ముకేశ్‌ కళ్లపై నాగార్జున కామెంట్‌
ముకేశ్‌ కళ్లను గమనించిన నాగార్జున.. ‘నీ కళ్లు చాలా బాగున్నాయి’ అంటూ ప్రశంసించారు. దీనికి ముకేశ్‌ థ్యాంక్యూ చెప్పాడు. ‘మీరు చెబుతుంటే నమ్మాలని అనిపిస్తుంది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున సరదాగా ‘ఏంటి.. దేబ్జానీ చెబితే అర్థం కాలేదా?’ అంటూ నవ్వించారు. దీంతో పక్కనే ఉన్న దేబ్జానీ ‘నేను నిజంగానే చెప్పా సార్‌’ అంటూ బదులివ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి.
ఇదీ చదవండి: షూటింగ్‌ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్
సినిమా టాస్క్‌..
కంటెస్టెంట్ల కోసం నాగార్జున సినిమా టాస్క్‌ నిర్వహించారు. నరేశ్‌ను రెండు టీమ్‌లుగా విభజించమని చెప్పడంతో అతడు ఏ, బీ టీమ్‌లుగా విభజించాడు. ఈ పోటీలో కృష్ణుడు టీమ్‌ విజయం సాధించింది. విజేతలకు స్వీట్‌ బాక్స్‌లను అందించారు. ఆ సమయంలో దేబ్జానీ రాత్రిపూట తనకు కాఫీ కావాలని నాగార్జునను కోరింది. అయితే కాఫీ కావాలంటే ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ సీక్రెట్‌ చెప్పాలని నాగార్జున కండిషన్‌ పెట్టారు.
ఇదీ చదవండి: త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్

దేబ్జానీ తన సీక్రెట్‌ చెబుతూ.. తాను ఆరో తరగతి రెండుసార్లు చదవాల్సి వచ్చిందని, తొలిసారి ఆరో తరగతిలో ఫెయిల్‌ అయ్యానని చెప్పింది. అయితే ఈ సీక్రెట్‌తో బిగ్‌బాస్‌ సంతృప్తి చెందలేదని నాగార్జున చెప్పడంతో మరో సీక్రెట్‌ బయటపెట్టింది.  బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న ముకేశ్‌ అంటే తనకు చాలా ఇష్టమని దేబ్జానీ చెప్పింది. ముకేశ్‌ అందరితో పులహారి కలుపుతాడని కానీ తన దగ్గరకు మాత్రం రావడం లేదని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ సీక్రెట్‌తో నాగార్జున ఆమెకు కాఫీని సాంక్షన్‌ చేశారు.

రెండో వీకెండ్‌.. ప్రేక్షకుల చేతుల్లోనే!
ఇక ఎపిసోడ్‌ చివర్లో వచ్చే వీకెండ్‌ ఎలా ఉండబోతుందో తెలిపే ఓ క్లిప్‌ను చూపించారు. ‘నెక్ట్స్‌ వీకెండ్‌ అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది’ అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్‌లో మరో ఆసక్తికరమైన పరిణామానికి తెరలేచినట్లైంది. అసలు వచ్చే వారం ప్రేక్షకుల చేతుల్లో ఉండబోయేది ఏంటి? ఎవరి గేమ్‌పై ఎలాంటి ప్రభావం పడనుంది? అనేది తెలియాలంటే తదుపరి ఎపిసోడ్‌ వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో త్రివిక్రమ్‌ ప్లానేంటి?
 

Videos

ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు

పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు

దుబాయ్ కి జంప్.? బయటపడ్డ NANDUS WORLD సీక్రెట్ స్కెచ్..!

ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం

కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో

యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు

3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Photos

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)