Breaking News

బిగ్‌బాస్ 10: వంశీ భార్యని చూశారా? ఎమోషనల్ ఎపిసోడ్

Published on Wed, 11/11/2026 - 08:54

పదోవారానికి సంబంధించిన నామినేషన్స్.. సోమవారం ఒక్కరోజులోనే పూర్తయ్యాయి. కెప్టెన్ వంశీ మినహా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఈసారి ఫ్యామిలీ వీక్ ఉందని బి‌గ్‌బాస్ ఇదివరకే చెప్పాడు. అందుకు తగ్గట్లే నరేశ్, వంశీ, శ్వేత కుటుంబ సభ్యులు బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చారు. ఇదంతా కూడా ఎమోషనల్‌గా సాగింది. ఇంతకీ 10వ సీజన్‌లో 65వ రోజైన మంగళవారం(నవంబర్ 10) ఏం జరిగింది?

(ఇదీ చదవండి: ఓటీటీకి తెలుగు థ్రిల్లర్ సినిమా.. ప్రకటన)

తొలుత స్కూల్ టాస్క్ పెట్టిన బిగ్‌బాస్... శ్వేత, నీతూ, దేబ్జానీ, వర్షిణి, నరేశ్ టీచర్లుగా చేయగా.. మిగిలినవాళ్లు స్టూడెంట్స్‌గా నటించారు. అందరూ స్కూల్ డ్రస్‌లు వేసుకొని పిల్లల్లా మారిపోయారు. ఇంగ్లీష్ క్లాస్ చెప్పిన నరేశ్ కాసేపు కామెడీ చేశాడు. ఫ్యామిలీ వీక్ సందర్భంగా తొలుత నరేశ్ సోదరుడు సురేశ్ వచ్చాడు. సురేశ్ నరేశ్‌కి కొన్ని సలహాలు ఇచ్చాడు. తర్వాత దేబ్జానీతోనూ మాట్లాడాడు. నరేశ్ గేమ్‌లో ఛాలెంజ్ చేసి ఫ్యామిలీని కలిసే ఛాన్స్ పోగొట్టుకున్నాడు. కానీ తన మాట మీద స్టాండ్ తీసుకొని వేరే వాళ్ళ కోసం త్యాగం చేశాడు కాబట్టి మొదట అతని ఫ్యామిలీనే పంపించానని బిగ్‌బాస్ చెప్పాడు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ చూపించి వీటి మీద రింగ్స్ వేస్తే అవి ఇంట్లో వాళ్లకు ఇస్తామని సురేశ్‌కి టాస్క్ ఇచ్చాడు.

తర్వాత వర్షిణి కెమిస్ట్రీ క్లాస్ తీసుకుంది. కాసేపటి తర్వాత శ్వేత అక్క ఇంట్లోకి వచ్చింది. తర్వాత నాన్న రావడంతో ఆయన్ని హగ్ చేసుకుని శ్వేత ఏడ్చేసింది. శ్వేత, త్రిగుణ్ తనకు చేస్తున్న సపోర్ట్ గురించి చెప్పడంతో అతడితో శ్వేత తండ్రి కాసేపు మాట్లాడారు. చివరలో అందరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఫుడ్ రింగ్ గేమ్.. శ్వేత తండ్రికి కూడా బిగ్‌బాస్ ఇచ్చాడు. తర్వాత వంశీ కూతురు వచ్చింది. తండ్రిని హగ్ చేసుకుని భావోద్వేగానికి గురైంది. వంశీ కూడా ఎమోషనల్ అయి ఏడ్చాడు. కూతురు కోసం వంశీ ఫుడ్ స్వయంగా వండాడు. తన కెప్టెన్ గదికి తీసుకెళ్లాడు.

తర్వాత వంశీ భార్య వచ్చింది. ఆమెని హగ్ చేసుకొని వంశీ ఏడ్చేశాడు. త్రిగుణ్ సపోర్ట్ చేస్తున్నందుకు స్పెషల్‌గా బ్రో అని పిలిచిన ఈమె.. అతడికి థ్యాంక్యూ చెప్పింది. త్రిగుణ్, వంశీ కూతురుతో కాసేపు ఆడుకున్నాడు. వంశీ, అతడి భార్యతో త్రిగుణ్ కూడా మాట్లాడాడు. నీలాంటి ఫ్రెండ్ ఉండాలని, మీ మైండ్ అలా గేమ్ ఆలోచించడం గ్రేట్ అని వంశీ భార్య త్రిగుణ్‌ని మెచ్చుకుంది. చివరలో వంశీ భార్య, కూతురికి కూడా ఫుడ్ రింగ్ టాస్క్‌ని బిగ్‌బాస్ ఇచ్చాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. బుధవారం కూడా ఫ్యామిలీ వీక్ ఉండనుంది.

(ఇదీ చదవండి: 'ఫేక్' మయం.. టాలీవుడ్‌లో దిగజారుతున్న పరిస్థితులు!)

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)