Breaking News

బిగ్‌బాస్ 10: వాళ్లిద్దరూ సేవ్ అయిపోయారు

Published on Fri, 10/30/2026 - 10:26

బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం హోటల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగానే మైండ్ గేమ్ కూడా కనిపించింది. అలా చివరకు సాగిన ఈ పోటీలో ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. ఇంతకీ ఎవరా ఇద్దరూ? 53వ రోజైన గురువారం(అక్టోబర్ 29) నాడు ఏం జరిగిందనేది చూద్దాం?

(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' ట్విటర్ రివ్యూ)

రోహిత్.. ముకేశ్ టీంలో కలిసిపోయాడు. నీకు స్టార్ ఇస్తా, వంశీని బీట్ చేసేలా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని వర్షిణితో రోహిత్ అన్నాడు. త్రిగుణ్‌తో డీల్స్ పెట్టుకుంటే నీకు సపోర్ట్  చేయనని కండీషన్ పెట్టాడు. మరోవైపు రెండు వేలకు తన స్టార్‌ని అమన్‌కి రోహిత్ ఇచ్చేశాడు. శివ, రాంప్రసాద్ దగ్గరకు వెళ్లి వర్షిణి గురించి మాట్లాడాడు. ముకేశ్.. వర్షిణిని గ్రీన్‌లోకి తేవాలని రోహిత్‌ని ఎల్లోలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని శివ్ చెప్పాడు. ఆ రెండూ జరగవని రాంప్రసాద్ అన్నాడు. మీరే గ్రీన్‌లోకి రావాలి, వర్షిణి గ్రీన్‌లోకి రోహిత్ ఎల్లోలోకి రావడానికి వీల్లేదన్నాడు.

బీబీ హోటల్‌ టాస్క్ అలా సాగుతుండగానే బిగ్‌బాస్.. ఒక పాము-నిచ్చెన ఛాలెంజ్‌ ఇచ్చాడు. ఇది ఆడటానికి ఒక ఓనర్, ఇద్దరు వర్కర్స్ ఉండేలా రెండు టీమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. గెస్టులందరూ డైస్ రోల్ చేసే ప్లేయర్స్‌గా పాల్గొనాలి. డైస్‌ రోల్ చేసినప్పుడు ఏ నంబర్ వస్తుందో, అదే నంబర్‌ పెద్ద డైస్‌పైకి తీసుకురావాలి. అందుకోసం పెద్ద డైస్ లోపల ఉన్న ఓనర్స్ దాన్ని లోపలి నుంచి తోస్తూ సరైన నంబర్ పైకి వచ్చేలా చేయాలని బిగ్‌ బాస్ చెప్పాడు. ఈ గేమ్‌లో శివ్ తరఫున పిక్కలలా రామకృష్ణ (బ్లూ),  శ్వేత (గ్రీన్) ఆడితే రాంప్రసాద్‌ తరఫున వంశీ (ఎల్లో), సుధీర్ (రెడ్) కలర్ పిక్కలలా ఆడారు. ఈ టాస్క్‌లో రాంప్రసాద్ గెలిచాడు. ఇతడి‌కి డబ్బులు స్టార్ రావడంతో స్టార్ తీసుకొని శివ్‌కి డబ్బులు ఇచ్చాడు.

ఇంటి సభ్యులకు ఫైనల్ డీలింగ్ చేసుకోమని బిగ్‌బాస్ చెప్పగా...  నాకు వాళ్ల మీద నెగిటివ్ వస్తుంది అందుకే మీకు స్టార్ ఇస్తున్నాని శివ్, రాంప్రసాద్‌తో అన్నాడు. అమన్ కూడా రాంప్రసాద్‌కి స్టార్ ఇచ్చాడు. చివరగా ఎవరి దగ్గర ఎంత క్యాష్, స్టార్స్ ఉన్నాయో చెప్పమని బిగ్‌బాస్ అడగ్గా.. వంశీ తన దగ్గర రూ.45 వేలు ఉందని చెప్పాడు. శ్వేత దగ్గర జీరో క్యాష్, జీరో స్టార్స్.. రామకృష్ణ దగ్గర రూ.300 క్యాష్.. సుధీర్ దగ్గర జీరో  క్యాష్.. రోహిత్ దగ్గర జీరో స్టార్స్ రూ.30,500 క్యాష్.. వర్షిణి దగ్గర  మూడు పింక్ స్టార్స్, ఒక గోల్డ్ స్టార్.. శివ్ దగ్గర జీరో స్టార్స్.. రాంప్రసాద్ దగ్గర ఏకంగా ఏడు పింక్ స్టార్స్, ఒక గోల్డ్ స్టార్ ఉన్నాయని చెప్పారు.

స్టార్స్ ఉన్న ఇద్దరు సభ్యులు రాంప్రసాద్, వర్షిణి ఎల్లో లెవెల్ నుంచి గ్రీన్ లెవెల్‌కు చేరుకొని గోట్స్ అయ్యారు. తద్వారా నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. వంశీ రెడ్ నుంచి ఎల్లో లెవల్‌కి వచ్చాడు. అలా గురువారం ఎపిసోడ్ పెద్దగా మెరుపుల్లేకుండానే పూర్తయింది. ఇక రోహిత్ మిగతా గొడవల్లో తప్పితే ఈ గేమ్‌లో పెద్దగా మెప్పించలేకపోయాడు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు)

Videos

హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?

కేంద్ర ఉద్యోగులకు ఒకేసారి 18 నెలల జీతం?

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తా.. లేదంటే... ప్రభాస్ మిర్చి డైలాగ్ తో మాస్ వార్నింగ్

పిఠాపురంలో దుమ్మురేపిన వంగా గీత ఎన్నికల ప్రచారం

'ఆదర్శ కుటుంబం' పబ్లిక్ టాక్

చమోలిలో హెలికాప్టర్ ప్రమాదం.. శకలాల కోసం గాలింపు

మా మహిళలపైనే చేయి వేస్తారా..? అందరి డేటా ఉంది..!

టీడీపీకి షాక్.. YSRCP లోకి భారీగా చేరికలు

9 నెలల వర్కవుట్స్.. సమంత స్పెషల్ వీడియో!

పులివెందులలో TDP మాస్టర్ స్కెచ్ .. పోలీసులే దగ్గరుండి లాడ్జీలలో..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)