ముంబయి వీధుల్లో అడుక్కుంటోన్న నటి.. అసలేమైంది?

Published on Tue, 06/02/2026 - 14:43

సినీ రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగంలో క్రేజ్‌తో కావాల్సినంత డబ్బు కూడా వస్తుంది. అయితే ఈ రంగం అందరికీ కలిసిరావడం అనేది చాలా తక్కువే. కొందరు తక్కువ టైమ్‌లో స్టార్‌గా ఎదిగితే.. మరికొందరికీ కొన్ని ఏళ్లు పడుతుంది. కానీ సినిమా వాళ్ల లైఫ్‌ కూడా పూలపాన్పు అనుకుంటే పొరపాటే అవుతుంది. సినిమా ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కనుమరుగైన వారు కూడా ఉన్నారు. మరికొందరేతే దారుణ పరిస్థితుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ముంబయిలో జరిగింది.

ప్రముఖ భోజ్‌పురి నటి మితాలీ శర్మ.. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. నటిగా ఎదిగింది. కట్ చేస్తే.. ఆమె ప్రస్తుతం ముంబయి వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించింది. సినిమా అవకాశాలు తగ్గడంతో చేసేదేమి లేక జీవన పోరాటం మొదలెట్టింది. ముంబయిలోని లోఖండ్‌వాలా వీధుల్లో అత్యంత దీనస్థితిలో భిక్షాటన చేస్తూ మిథాలీ కనిపించింది.

ఒకప్పుడు తెరపై మెప్పించిన నటిని వీధిలో అలాంటి స్థితిలో చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. మితాలీకి తన కుటుంబంతో సంబంధాలు క్రమంగా తెగిపోయాయి. పనిలేకపోవడం, మరోవైపు కుటుంబ మద్దతు లేకపోవడంతో ఆమె ఒంటరితనానికి గురైంది. నిరంతర వైఫల్యాలు, తిరస్కరణలు ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. 

అత్యంత దీనస్థితిలో ఉన్న మితాలీని గుర్తించిన పోలీసులు ఆమెను సంరక్షించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన తర్వాత మిథాలీకి ఆహారం అందించారు. ఆమెకు వెంటనే అవసరమైన వైద్య చికిత్స అందించారు. ఆమె మానసిక పరిస్థితి క్షీణించండ వల్ల.. ప్రస్తుతం ఆమెను ఒక మానసిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మిథాలీ చూస్తుంటే చిత్ర పరిశ్రమలో నటీనటుల పరిస్థితికి అద్దం పడుతోంది. గ్లామర్ ప్రపంచం అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు.. వెండితెర వెనక జీవితం కూడా చూడాలని అంటున్నారు.
 

 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)