Breaking News

నడిరోడ్డుపై సెలబ్రిటీ జంటపై వేధింపులు, పోలీసులపై నటి అసహనం

Published on Sun, 12/11/2022 - 14:30

సినీ సెలబ్రెటీ జంటకు రోడ్డుపై చేదు అనుభవం ఎదురైంది. బెంగాలి సినీ పరివ్రమకు చెందిన నటి కారును ఢీకొట్టి ఆపై వారినే డ్రైవర్‌, క్లీనర్‌ వేధించిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో శనివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ నటి పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. సంఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ వీడియోలో సదరు నటి ఆరోపించింది. వివరాలు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బెంగాలి నటి నబనీత దాస్‌, ఆమె భర్త నటుడు జీతు కమల్‌ శనివారం కారులో బయటకు వెళ్లారు.

చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్‌

నిమ్తా పోలీసు స్టేషన్‌ సమీపంలో ఓ గూడ్స్‌ వ్యాన్‌ వీరి కారును ఢీ కోట్టింది.  అయితే డ్రైవర్‌ కనీసం వ్యాన్‌ కూడా ఆపకుండ వెళ్లిపోవడం నటి నవనీత డ్రైవర్‌ను ప్రశ్నించింది. దీంతో డ్రైవర్‌ తన క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఈ సెలబ్రెటీ జంటతో వాగ్వాదానికి దిగారు. వారితో గొడవ పడటమే కాదు చంపేస్తామని బెదింరించారు. అయితే ఇదంత పక్కనే ఉండి చూస్తున్న పోలీసులు ఘటనను సినిమా చూస్తున్నట్లు చూశారని, వారు తమని వేధిస్తుంటే కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదని నబనీత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోని ఆమె ‘నింత ఏఎస్ఐ పరశురామ్ బాబు డ్యూటీ ఎలా చేస్తున్నారో చూడండి. వావ్ మీరు గెలిచారు సార్.

చదవండి: ఎయిర్‌పోర్టులో తారక్‌, మళ్లీ ఫ్యామిలీతో విదేశాలకు! నిరాశలో ప్యాన్స్‌

నేను నిరసన చేయదలచుకోలేదు’ అంటూ నబనిత తన ఫేస్‌బుక్‌ ఖాతాలో వీడియో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పబ్లిక్ కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ వ్యక్తులకే రక్షణ కల్పించలేని పోలీసులు సాధారణ ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసులు తమ విధిని నిర్వర్తించడంలో విఫలమయ్యారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమను వేధించినందుకు, ఆసభ్య పదజాలంతో దూషిస్తూ చంపేస్తామని బెదిరించిన సదరు డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరిపై నటి నవనీత ఆమె భర్త జీతు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)