థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
టాలీవుడ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. నిశ్చితార్థం కూడా
Published on Fri, 04/03/2026 - 20:10
తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది. గత నెలలో తనకు కాబోయే భార్య కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. ఇంట్లోనే చిన్నపాటి వేడుక నిర్వహించి టాలీవుడ్ సెలబ్రిటీలని పిలిచాడు. ఇది నిశ్చితార్థం అని చాలామంది భావించారు. అయితే ఇది ఇరు కుటుంబాల పరిచయ వేడుక అని త్వరలో ఎంగేజ్‌మెంట్, పెళ్లి తేదీలని వెల్లడిస్తానని అన్నాడు. ఇప్పుడు అదే చేశారు.
(ఇదీ చదవండి: 'రామాయణ' కోసం రెహమాన్‌కి అన్ని కోట్ల పారితోషికమా?)
కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చినట్లే ఈ నెల 29న తిరుపతిలో పెళ్లి జరగనుంది. అంతకు ముందు అంటే ఈ ఆదివారం(ఏప్రిల్ 5) హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగనుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోనే టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్(వివాహ విందు) ఏర్పాటు చేయనున్నారు.
శ్రీనివాస్ విషయానికొస్తే ప్రముఖ నిర్మాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు. 'అల్లుడు శీను' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత చాలా సినిమాలు చేస్తున్నాడు గాన సరైన సక్సెస్ దక్కట్లేదు. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు చేస్తున్నాడు. కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. ఈమె తండ్రి, తాత న్యాయవృత్తిలో కొనసాగుతున్నారు.
(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన శర్వానంద్.. విడాకులు నిజమేనా?)
Tags : 1