Breaking News

జేమ్స్ కామెరూన్ అవతార్-3.. ఇండియాలో క్రేజీ రికార్డ్..!

Published on Fri, 12/26/2025 - 13:00

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌ చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్. ఈ సిరీస్‌లో వచ్చిన పార్ట్‌-3 ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 19న ఇండియా వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది.  ఈ ఏడాది  మనదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా అవతరించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.

ఈ క్రమంలోనే అవతార్ -3.. హాలీవుడ్ మూవీ ఎఫ్1  ఇండియా ఆల్‌టైమ్‌ వసూళ్లను అధిగమించింది. దీంతో ఈ ఏడాది హాలీవుడ్‌ చిత్రాల లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌ కైవసం చేసుకుంది. అవతార్-3 ఇప్పటివరకు ఇండియావ్యాప్తంగా రూ. రూ. 131  కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే 2025లో విడుదలైన బ్రాడ్ పిట్ మూవీ ఎఫ్‌1  రూ. 129 కోట్ల వసూళ్లను అధిగమించింది.  ఇప్పటివరకు భారతదేశంలో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రంగా అవతార్-3 నిలిచింది.

అవతార్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ చిత్రానికి ఇండియాలో అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయింది. తొలి రోజు కేవలం రూ. 23 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్ రావడంతో వసూళ్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మూవీ దురంధర్‌ బాక్సాఫీస్ బరిలో ఉండడం అవతార్‌-3కి కలిసి రాలేదని చెప్పాలి. కాగా.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 400 మిలియన్ డాలర్ల మార్క్‌కు దగ్గర్లో ఉంది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)