Breaking News

'అవతార్ 3' విలన్ చార్లీ చాప్లిన్ మనవరాలా?

Published on Wed, 12/31/2025 - 16:04

పదిరోజుల క్రితం థియేటర్లలో వచ్చిన హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ 'అవతార్ 3'.. భారత్‍లో అంతంత మాత్రంగానే ఆడింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే స్టోరీపై విమర్శలు వచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయనే ప్రశంసలు వచ్చినప్పటికీ ఓవరాల్ టాక్ మాత్రం ఏమంత గొప్పగా అయితే లేదు. సరే టాక్, కలెక్షన్స్ గురించి పక్కనబెడితే ఇందులో విలన్‌గా చేసిన నటి.. దిగ్గజ కమెడియన్ చార్లీ చాప్లిన్ మనవరాలు అనే విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది.

1950,60ల్లో మూకీ కామెడీతో చాలా గుర్తింపు తెచ్చుకున్న చార్లీ చాప్లిన్.. ఇప్పటి తరంలోనూ చాలామందికి తెలుసు. అయితే ఈయన తర్వాత కుటుంబ సభ్యులెవరైనా యాక్టర్స్ అయ్యారా? ఏదైనా సినిమాలు చేశారా? అనేది పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే 'అవతార్ 3'లో విలన్ వరంగ్ పాత్రలో చేసిన ఊనా చాప్లీన్.. ఆయనకు మనవరాలి అనే విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ వాయిదా)

ఊనా చాన్నాళ్లుగా యాక్టింగ్ చేస్తోంది. 2007 నుంచి సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో సహాయ పాత్రలు చేస్తోంది. కాకపోతే పెద్దగా ఫేమ్ లాంటిది దక్కలేదు. ఓటీటీల్లో క్లాసిక్ సిరీస్ అయిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లోనూ స్టార్క్ రాజు పెద్ద కొడుకు భార్యగా టలీషా స్టార్క్ పాత్రలో కొన్ని ఎపిసోడ్స్ కనిపిస్తుంది. చిన్న పాత్రనే అయినప్పటికీ గుర్తుండిపోయింది. దీనితో పాటు చాలా మూవీస్, సిరీస్‌లు చేసినప్పటికీ మళ్లీ ఇన్నాళ్లకు 'అవతార్ 3'లో విలన్ రోల్ వల్ల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

చార్లీ చాప్లిన్ కూతురు గెరాల్డైన్. ఈమె పుట్టింది ఊనా చాప్లిన్. తాత, అమ్మలానే యాక్టర్ అయింది. తాత కామెడీతో నవ్విస్తుంటే మనవరాలు మాత్రం విలనిజంతో భయపెడుతోంది.

(ఇదీ చదవండి: ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ మూవీ రివ్యూ)

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)

+5

రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)