రూ.1 కోటి ప్రైజ్‌మనీ.. అగ్రిమెంట్‌ ప్రకారం 30 శాతం ఇచ్చేయాలట!

Published on Sat, 10/26/2024 - 17:58

రియాలిటీ షోల వల్ల సెలబ్రిటీలకు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వస్తోంది. అందుకే ఏదో ఒక షోతో సరిపెట్టుకోకుండా వీలైనన్నిచోట్లా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అషుతోష్‌ కౌశిక్‌ కూడా అదే చేశాడు. ఎమ్‌టీవీ రోడీస్‌ ఐదో సీజన్‌ (2007)లో పాల్గొన్న ఇతడు ఆ షో టైటిల్‌ విజేతగా రూ.2.5లక్షలు గెలుచుకున్నాడు. అయితే ఇందులో మెజారిటీ భాగం టాక్స్‌ కట్టడానికే పోయిందట. 

రూ.1 కోటి ప్రైజ్‌మనీ
ఆ మరుసటి ఏడాది అంటే 2008లో హిందీ బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొన్నాడు. ఈ షోలో ఏకంగా రూ.1 కోటి గెలుచుకున్నాడు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైందట.. దీని గురించి అషుతోష్‌ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ షోలో నేను రూ.1 కోటి గెలుచుకున్నాను. అందులో రూ.30 లక్షలు తమకు ఇవ్వాలని ఎమ్‌టీవీ డిమాండ్‌ చేసింది. అదేమంటే నేను రుణపడి ఉన్నానంది. వారి అగ్రిమెంట్‌ ప్రకారం రెండేళ్లపాటు నేను సంపాదించినదానిలో 30 శాతం ఎమ్‌టీవీకే ఇవ్వాలి.

డమ్మీ వీజేగా పెట్టి..
నాకు పెద్దగా చదువు రాదు. దీంతో అగ్రిమెంట్‌ చదవకుండానే సంతకం చేశాను. కానీ బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీ గిఫ్ట్‌ కిందకు వస్తుందని, అది జీతం కిందకు రాదని వాదించాను. పైగా బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చినప్పుడే ఎమ్‌టీవీ వాళ్లను సంప్రదించాను. వాళ్లు నాకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదు. అసలు పట్టించుకోలేదు. చివరగా ఓ ఒప్పందానికి వచ్చాం. వారికోసం రెండేళ్లపాటు వీజేగా పని చేశాను. అప్పుడు నాకు నెలకు రూ.1.5 లక్షలు ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)