Breaking News

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఆషికా సినిమా

Published on Fri, 01/30/2026 - 10:49

అమిగోస్, నా సామిరంగ, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర సినిమాలతో హీరోయిన్‌గా తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఆషికా రంగనాథ్. స్వతహాగా ఈమె కన్నడ అమ్మాయి. అక్కడ చాలానే మూవీస్ చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఈ నెల ప్రారంభంలోనే సొంత భాషా చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. దాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడా సినిమా ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్)

గత జన్మల ప్రేమకథ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెలుగులో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'గత వైభవం'. జనవరి 1న తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. కానీ కంటెంట్ పరంగా మరీ తీసికట్టుగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఇప్పుడీ మూవీ సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో ఆషికా, దుష్యంత్ ప్రధాన పాత్రలు చేయగా.. సునీ దర్శకత్వం వహించారు.

'గత వైభవం' విషయానికొస్తే.. ఆధునిక(ఆషికా రంగనాథ్‍)కి పెయింటింగ్స్ వేయడం అలవాటు. తన ఊహల్లో వచ్చే ఓ వ్యక్తి చిత్రాన్ని గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సరిగ్గా అదే పోలికలతో ఉన్న పురాతన్ (దుష్యంత్) ఈమెకు ఎదురుపడతాడు. విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో నడిపే పురాతన్.. తొలుత ఆధునికకు తప్పుడు ఉద్దేశంతో దగ్గరవ్వాలని చూస్తాడు గానీ తన గత జన్మల గురించి ఆమె చెప్పే నిజాలు ఇతడిని షాక్‌కి గురిచేస్తాయి. ఆధునికకు అసలు గత జన్మల గురించి ఎలా తెలుసు? వందల ఏళ్లక్రితం వీళ్లిద్దరి మధ్య బంధమేంటి? అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)