Breaking News

హీరోగా కాదు.. అలా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్‌ ఖాన్‌ కొడుకు

Published on Tue, 04/12/2022 - 16:48

Aryan Khan Bollywood Debut As Director To A Web Series: బాలీవుడ్‌ బాద్‌షా కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ వెండితెరకు పరిచయం కానున్నాడు. ఆర్యన్‌ హీరోగా ఏదో ఒక సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడని ఇప్పటివరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆర్యన్ హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా కొత్త ట్విస్ట్‌ ఇచ్చాడు. బాలీవుడ్‌కు ఆర్యన్ ఖాన్‌ దర్శకుడిగా పరిచయం కానున్నాడని ఓ ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. ఆర్యన్ ఖాన్‌ ఒక వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నాడట. దానికి కథను కూడా ఆర్యన్‌ ఖాన్‌ అందించాడని సమాచారం. ఈ వెబ్‌ సిరీస్‌ షారుఖ్‌ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన టెస్ట్‌ షూట్‌ను ముంబైలోని ఓ స్టూడియోలో జరిపినట్లు తెలుస్తోంది.

ఈ టెస్ట్‌ షూట్‌కు ఆర్యన్‌ ఖాన్‌ పూర్తి బాధ్యతను తీసుకున్నాడట. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందే ప్రతి ఒక్కరికీ ఈ ప్రాజెక్ట్‌పై అవగాహన ఉండాలనేది ఆర్యన్‌ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ముందుగా ఏప్రిల్‌ 8, 9 తేదిల్లో టెస్ట్‌ షూట్‌ నిర్వహించారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుందట.

చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి మృతి



ఆర్యన్‌ ఖాన్‌కు తనలా హీరో కావాలనే ఆలోచిన లేదని, సినిమా నిర్మాణంలోని వివిధ అంశాలు తనకు నచ్చేవని ఇదివరకూ పలుమార్లు షారుఖ్‌ ఖాన్‌ తెలిపాడు. ఇక షారుఖ్‌ ఖాన్‌ రెండో సంతానం, కుమార్తె సుహానా ఖాన్‌ ఓ వెబ్‌ సిరీస్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే ఈ వెబ్‌ సిరీస్‌కు జోయా అక్తర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అర్చీస్‌ కామిక్‌ ఆధారంగా తెరకెక్కనుంది. 

చదవండి: కారులో ‘సీక్రెట్‌ ఫ్రెండ్‌’తో అడ్డంగా బుక్కైన స్టార్‌ హీరో కూతురు

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)